నిఘా గాలికి! | Sakshi
Sakshi News home page

నిఘా గాలికి!

Published Thu, Sep 19 2013 3:52 AM

Has posed a threat to the country in the form of terrorist

 వెంకటగిరి, న్యూస్‌లైన్: ఉగ్రవాదుల రూపంలో దేశానికి ముప్పు పొంచి ఉం దని, అప్రమత్తంగా వ్యవహరించాలని తరచూ పోలీసులను కేంద్ర ఇంటెలి జెన్స్ హెచ్చరిస్తోంది. మరోవైపు హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలుపట్టణాల్లో తరచూ బాంబుపేలుళ్లు జరిగి వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా మన అధికారుల్లో చలనం కరువైంది. నిత్యం పెద్దఎత్తున పేలుడు పదార్ధాల అక్రమ ర వాణా జరుగుతున్నా తెలియనట్టే వ్యవహరిస్తున్నారు.
 
 బుధవారం డక్కిలి వ ద్ద వాహన తనిఖీలు చేస్తుండగా ఓ ట్రక్‌లో కూరగాయల ట్రేల మాటున పేలుడు ప దార్థాలను తరలిస్తున్న విషయం వెలుగులోకి రావడంతో జిల్లా వాసులు ఉ లిక్కిపడ్డారు. దొరికింది ఇదొక్క వాహన మే అయినా నిత్యం జిల్లాలోని పలు క్ర షర్లకు పేలుడు పదార్థాలు అక్రమంగా రవాణా జరుగుతున్నట్టు సమాచారం. ఇదేక్రమంలో ఉగ్రవాదులు, మావోయిస్టులు, సంఘవిద్రోహ శక్తులు పేలుడు పదార్థాలతో చొరబడితే ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరు అల్లకల్లోలం కా వడం ఖాయం. ప్రపంచంలోనే పేరుగాంచిన షార్‌కేంద్రంతో పాటు కృష్ణపట్నం పోర్టు, పలు పరిశ్రమలు జిల్లాలో ఉన్నాయి.
 
 ఈ క్రమంలో అనుక్షణం అ ప్రమత్తంగా వ్యవహరించాలని ఉన్నతాధికారుల నుంచి తరచూ ఆదేశాలు వ స్తున్నాయి. ఆ సమయంలో కొంత హ డావుడి చేసే అధికారులు, అనంతరం ఊరుకుంటున్నారు. మరోవైపు పేలుడు పదార్థాల అక్రమ రవాణా మాత్రం య థావిధిగా సాగిపోతోంది.  జిల్లాలోని గూడూరు, పొదలకూరు, సైదాపురం, రాపూరు, దుత్తలూరు, ఉదయగిరి, పె ళ్లకూరు, మర్రిపాడు, సీతారామపురం మండలాల్లో విస్తారమైన ఖనిజ సంపద నిక్షేపాలు ఉన్నాయి. వీటిని వెలికితేసేం దుకు విచ్చలవిడిగా పేలుడు పదార్థా లను వినియోగిస్తున్నారు. అధికారికం గా పేలుడు పదార్ధాల విక్రయ ప్రదేశం సైదాపురంలో ఉంది. ఇక్కడ రెండు ఏ జెన్సీల ద్వారా పేలుడు పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ అ నుమతి పొందిన క్వారీలకు మాత్రమే పేలుడు పదార్ధాలను సురక్షిత పద్ధతిలో రవాణా చేయాల్సి ఉంది. ఇక్కడ జిలెటి న్ స్టిక్స్, ఎలక్ట్రికల్ డిటోనేటర్స్, సాధారణ డిటోనేటర్స్, ఫ్యూజుకాయిల్స్‌ను విక్రయిస్తున్నారు. అయితే కొందరు ఇ తర జిల్లాల నుంచి నిత్యం యథేచ్ఛగా పేలుడు పదార్ధాలను తెస్తున్నారు.
 
 ని బంధనల ప్రకారం విక్రయ కేంద్రాల వారు రోజువారి నివేదికలను ఆన్‌లైన్ లో అధికారులకు తెలియజేయాలి. ఏ మైన్‌కు ఎంత మేర పదార్థాలు సరఫరా చేశారో అందులో పేర్కొనాలి. అనుమతులు లేని క్వారీలకు పేలుడు పదార్ధా లు ఎలా సరఫరా అవుతున్నాయో స మాధానం చిక్కని ప్రశ్నగా మారింది. పోలీసు నిఘా లోపించడంతోనే అక్రమ రవాణా జోరుగా సాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ బ్లాస్టిం గ్‌ల సమయంలో ఎందరో అమాయకు లు ప్రాణాలు కోల్పోతున్నారు. సంబంధిత అధికారులు మామూళ్లు పుచ్చుకుని చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంతోనే ఇలా జరుగుతోందని వి మర్శలున్నాయి.
 
 ఈ పేలుడు పదార్థాలు సంఘవిద్రోహ శక్తులకు చేరితే జరిగే పరిణామాలను ఊహించడమే కష్టమని జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నా రు. 23 ఏళ్ల క్రితం గూడూరు డీఎస్పీగా వ్యవహరిం చిన ప్రస్తుత ఎస్పీ రామకృష్ణ అప్పట్లో పేలుడు పదార్థాల నిల్వ కేంద్రాలపై ఏఆర్ సిబ్బందితో నిఘా పెట్టారు. ఇప్పుడు కూడా అదేక్రమంలో నిఘా పెట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
 

Advertisement
Advertisement