‘కేసీఆర్‌ను విమర్శిస్తే సహించం’ | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్‌ను విమర్శిస్తే సహించం’

Published Mon, Sep 2 2013 2:48 AM

He fighter, Telangana leader K. Candrasekhararavunu criticizing

 బోధన్ టౌన్, న్యూస్‌లైన్ : తెలంగాణ పోరాట యోధుడు, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావును విమర్శిస్తే సహించబోమని తెలంగాణ జాగృతి మండల కన్వీనర్ మీర్జాపూర్ హరిశంకర్ సీమాంధ్ర నాయకులను హెచ్చరించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కేసీఆర్ చిత్రపటాలకు పెళ్లి చేసిన సీమాంధ్రుల చేష్టలను నిరసిస్తూ ఆదివారం బోధన్ పాత పోస్టాఫీసు వద్ద కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన యోధుడు కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆస్తులున్నవారే సీమాంధ్రులను రెచ్చగొట్టి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులను అవమానించొద్దని హితవు పలికారు. కార్యక్రమంలో నాయకులు రవిశంకర్, సురేశ్, వినయ్, రవి, సాయిలు, కోక రవి, మల్లెపూల శంకర్, గణేశ్, ప్రకాశ్‌గుప్తా, సిద్దూ తదితరులు పాల్గొన్నారు.
 
 కుట్రలు మానండి
 ఆర్మూర్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని చెప్పినవారే ప్రస్తుతం మాటమార్చి కృత్రిమ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ గైని గంగారాం ఆరోపించారు. తెలంగాణకు వ్యతిరేకంగా పెట్టుబడిదారు లు, సీమాంధ్ర పాలకులు చేస్తున్న కుట్రలను ఖండిం చారు. ఆదివారం ఆర్మూర్‌లో సీమాంధ్ర నాయకుల దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఆయ న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని, అడ్డుకోబోమని చెప్పిన పార్టీలు.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను జీర్ణించుకోలేక యూ టర్న్ తీసుకున్నాయని విమర్శించారు. 
 
 దీంతో వారి అసలు స్వరూపం బయటపడిందన్నారు. కుట్రలు మానాల ని సీమాంధ్ర నేతలకు సూచించారు. అన్నదమ్ములు గా విడిపోయి ప్రాంతాలుగా కలిసి ఉందామన్నారు. కార్యక్రమంలో జేఏసీ మండల చైర్మన్ దేవరాం, ఉద్యోగ సంఘాల ఉమ్మడి జేఏసీ చైర్మన్ పెంట జలంధర్, జేఏసీ నాయకులు నరేందర్ నాయక్, సత్తెక్క, మచ్చేందర్, సురేశ్, నర్సయ్య, కిషన్, రాజేశ్వర్, రాచర్ల దశరథ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement