ఆరోగ్యవంతమైన సమాజమే ‘మార్పు’ లక్ష్యం | Sakshi
Sakshi News home page

ఆరోగ్యవంతమైన సమాజమే ‘మార్పు’ లక్ష్యం

Published Sat, Dec 28 2013 3:06 AM

సిత్మా సబర్వాల్

గజ్వేల్ రూరల్, న్యూస్‌లైన్:  ఆరోగ్యవంతమైన సమాజమే ‘మార్పు’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ సిత్మా సబర్వాల్ అన్నారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలోని కోలా అభిరాం గార్డెన్స్‌లో ‘మార్పు’ కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, ‘మార్పు’ పథకం అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి గర్భిణి ఈ పథకంలో తన పేరు నమోదు చేసుకునేలా అధికారులు వారికి అవగాహన కల్పించాలన్నారు. మాత, శిశు సంరక్షణ కార్డులో  పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా ఉచితంగా పౌష్టికాహారం, వైద్య సేవలు, సూచనలు అందుతాయని తెలియజెప్పాలన్నారు.

ఓ మహిళ గర్భం ధరించినప్పటి నుంచీ ఆమెకు అన్ని విధాలా సలహాలు, సూచనలు అందిస్తూ, ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవం అయ్యే విధంగా ఆశ వర్కర్లు, అంగన్‌వాడీలు, ఏఎన్‌ఎంలు చర్యలు తీసుకోవాలన్నారు.  అధికారులు సమన్వయంతో పని చేసి ‘మార్పు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ, కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లు నెలకోసారి గ్రామంలో సమావేశం జరిగేలా చూడాలన్నారు. ప్రతి పథకాన్నీ మహిళలకు అందించడంలో చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పద్మ, డీసీహెచ్ వీణ, డీఆర్‌డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి, డీపీఓ జగన్నాథం, డీఈఎంఓ వసంతరావు, నియోజకవర్గంలోని ఎంపీడీఓలు, తహశీల్దార్లు, పీహెచ్‌సీ ైవె ద్యాధికారులు, ఐకేపీ సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement