ఉత్తరాంధ్రలో హై అలర్ట్.. పలురైళ్లు రద్దు | Sakshi
Sakshi News home page

ఉత్తరాంధ్రలో హై అలర్ట్.. పలురైళ్లు రద్దు

Published Sat, Oct 11 2014 7:52 AM

ఉత్తరాంధ్రలో హై అలర్ట్.. పలురైళ్లు రద్దు

హుదూద్ తుఫాను కారణంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేశారు. తుఫాను కారణంగా పలు జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. మరోవైపు హుదూద్ తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది. ప్రయాణికుల భద్రత కోసం ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్లైన్లను ఏర్పాటు చేశారు. తుఫాను కారణంగా 30 రైళ్లను రద్దు చేయగా, మరి కొన్నింటిని దారి మళ్లించారు. ఈస్ట్కోస్ట్ రైల్వే పరిధిలో 37 రైలు సర్వీసులు రద్దయ్యాయి, 31 రైళ్లను దారి మళ్లించారు.

కంట్రోల్ రూంల నెంబర్లు
తూర్పుగోదావరి- 0884 2359173; విశాఖ- 1800 4250 0002; శ్రీకాకుళం ౦ 1800 4256625; విజయనగరం - 08922 276888; పార్వతీపురం - 08963 221006

Advertisement
Advertisement