ఆ పొలాలను ల్యాండ్ పూలింగ్ నుంచి తొలగించాలి: హైకోర్టు | Sakshi
Sakshi News home page

ఆ పొలాలను ల్యాండ్ పూలింగ్ నుంచి తొలగించాలి: హైకోర్టు

Published Fri, Apr 24 2015 5:43 PM

ఆ పొలాలను ల్యాండ్ పూలింగ్ నుంచి తొలగించాలి: హైకోర్టు - Sakshi

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కోసం తలపెట్టిన ల్యాండ్ పూలింగ్కు హైకోర్టులో చుక్కెదురైంది. ల్యాండ్ పూలింగ్ను వ్యతిరేకిస్తూ 600 మంది రైతులు ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. దాంతో వారి పొలాలను ల్యాండ్ పూలింగ్ నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సమయానికి దానిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని.. ప్రభుత్వమే అమలు చేయకపోవడం న్యాయసమ్మతం కాదని న్యాయమూర్తులు వ్యాఖ్చానించారు. ల్యాండ్ పూలింగ్ను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన రైతులు తమ భూముల్లో నిరభ్యంతరంగా వ్యవసాయం చేసుకోవచ్చని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. రైతుల తరఫున ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement