అగ్రిగోల్డ్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Published Wed, Apr 25 2018 4:06 PM

High Court Responds On Agri Gold Case - Sakshi

హైదరాబాద్‌ : అగ్రిగోల్డ్‌ కేసుకు సంబంధించి బుధవారం హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డు ఆస్తుల కొనుగోలు విషయంలో జిఎస్సెల్‌ గ్రూప్‌ వెనక్కి తగ్గింది. దీంతో పిటిషనర్‌ , కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసినందుకు గానూ ఎస్సెల్‌ గ్రూప్‌పై ( సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌) పెనాల్టీ వేయాలని అఫిడవిట్‌ దాఖలు చేశారు.

వాదనలు విన్న న్యాయమూర్తి ఎస్సెల్‌ గ్రూపుకు చివరి అవకాశం ఇచ్చారు. జూన్‌ 5 నాటికి రూ.1000 లేదా 1500 కోట్లు డిపాజిట్‌ చేయాలని ఆదేశించారు. లేని పక్షంలో రూ.100 కోట్ల విలువ చేసే అగ్రిగోల్డ్‌ 10 ఆస్తులను గుర్తించి ప్రభుత్వం వేలం వేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూన్‌ 5కు హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement