చిత్తూరులో మూడోరోజు ధర్నాలు | Sakshi
Sakshi News home page

చిత్తూరులో మూడోరోజు ధర్నాలు

Published Mon, Oct 19 2015 3:40 PM

high protests for special status in chittoor district

చిత్తూరు :  ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చిత్తురు జిల్లా వ్యాప్తంగా మూడో రోజు నిరసనలు పెద్ద ఎత్తున కొనసాగాయి. రాస్తారోకో,  ధర్నాలు, రిలే నిరాహార దీక్షల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీ వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో  రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలను సోమవారం వైఎస్సార్ సీపీ నాయకులు ముట్టడించారు. స్థానిక తహశీల్దార్లకు వినతి పత్రాలు సమర్పించారు.  
 

జిల్లా వ్యాప్తంగా కొనసాగిన నిరసనలు..

  • భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా
  • చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద రాస్తారోకో
  • పలమనేరు ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముట్టడి
  • పెనుమూరు ఎమ్మెల్యే నారాయణస్వామి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముట్టడి
  • పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముట్టడి
  • తవనంపల్లి ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముట్టడి
  • జంగాలపల్లి శ్రీనివాసులు, ఎంఎస్ బాబు ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముట్టడి
  • కుప్పంలోని వైఎస్సార్ సర్కిల్లో కొనసాగుతున్న రిలే దీక్షలు
     

Advertisement
Advertisement