సన్మానం దేనికి సారూ...? | Sakshi
Sakshi News home page

సన్మానం దేనికి సారూ...?

Published Sun, Dec 7 2014 1:34 AM

Honor

గుంటూరు సిటీ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీలేవీ అమలు చేయకుండానే సన్మానాలు ఎందుకు చేరుుంచుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ప్రశ్నించారు.
 
 శనివారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో ఆమట్లాడుతూ రుణమాఫీ చేయకుండానే చేసినట్టు నాటకాన్ని రక్తికట్టించినందుకా...అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నందుకా అని నిలదీశారు. తిమ్మిని బమ్మిని చేస్తున్న బాబు ఏదో సాధించినట్టు సన్మానం చేరుుంచుకోవడంపై ఆయన విరుచుకుపడ్డారు. లక్ష కోట్ల రుణాలకు 5వేల కోట్లు చెల్లిస్తానని చెప్పడం ఏం గొప్ప అని ప్రశ్నించారు. వ్యవసాయ రుణాలన్నీ
 అని ముందు చెప్పి, చివరికి పంట రుణాలకే అంటూ మాట మార్చారనీ, రుణాలు రీషెడ్యూల్ చేయడానికి ఆర్‌బీఐ అంగీకరించిందని చెప్పి రీషెడ్యూల్ చేయకుండా, కొత్త రుణాలు రాకుండా చేశారని చెప్పారు.
 
   బాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించకపోవడంతో బీమా సౌకర్యాన్ని కూడా రైతులు కోల్పోయూరని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలు కూడా పూర్తిగా రద్దు చేస్తానని చెప్పి అసలు వాటి ఊసే ఎత్తకుండా తెలుగు ఆడపడుచులను మోసం చేశారన్నారు. వీటన్నింటినీ వ్యతిరేకిస్తూ నిర్వహించిన ధర్నాకు వచ్చే రైతులను, మహిళలను పోలీసులతో అడ్డుకున్నారని దుయ్యబట్టారు. సిగ్గు ఉన్నట్టరుుతే సన్మానం చేయించుకోరని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి చౌకబారు సన్మానాలతో ఇంకా ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నించడం హేయమని మండిపడ్డారు. శుక్రవారం జరిగిన మహాధర్నాకు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసిన అందరికీ మర్రి రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.
 
 అధికారంలో ఉన్నాం కదా ఏమి చేసినా చెల్లుతుందనుకోవడం అవివేకమన్న వాస్తవం ఈ ధర్నా ద్వారా నిరూపితమైందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వేల మంది వీధుల్లోకి వచ్చారంటేనే ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత స్పష్టమౌతోందన్నారు. అక్రమ కేసులు, అణచివేత చర్యలకు భయపడే వారెవరూ వైఎస్సార్‌సీపీలో లేరనీ, ఇకపై అలాంటి ఛేష్టలకు స్వస్థి పలకాలనీ మర్రి రాజశేఖర్ హితవు పలికారు.
 

Advertisement
Advertisement