రైతన్న గుండెమంట! | Sakshi
Sakshi News home page

రైతన్న గుండెమంట!

Published Mon, Nov 3 2014 1:26 AM

రైతన్న  గుండెమంట! - Sakshi

 నందిగాం:ప్రకృతి విసిరిన పంజాతో అన్నదాత వెన్ను విరిగింది. ఆరుగాలం శ్రమించి.. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతన్న గండె మండిపోయింది. హుదూద్ తుపాను తరువాత వరిపై తెగుళ్లు దాడి చేయడంతో ఎండిపోరుునట్టు మారిన చేనును చూసి.. కన్నీరు కార్చే ఓపిక లేక ఆవేదనతో కుప్పకూలిపోతున్నాడు. చి‘వరి’కి చేసేది లేక తన చేతితోనే పంట చేనుకు నిప్పుపెట్టి గుండె మంటను చల్లార్చుకుంటున్నాడు. నిన్న సంతబొమ్మాళి, నేడు నందిగాం మండలంలో వరి చేనుకు రైతులు నిప్పంటించి తన కడుపు కోతను తీర్చుకున్నారు. దీన్ని చూసిన వారు ఆయ్యో రైతుకి ఏమిటీ పరిస్థితి అంటూ సానుభూతిని చూపుతున్నాడు.  ఇది ప్రస్తుతం సిక్కోలు జిల్లాలోని రైతు పరిస్థితి. ఏటా పంట చేతికి రాకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దీంతో బతుకుతెరువు కోసం చాలా కుటుంబాలు పట్టణాలకు వలసలు పోతున్నారు. కొంతమంది రైతులు దిక్కుతోచని స్థితిలో గ్రామంలో ఉంటూ పంటలు పండిస్తుంటే అప్పులు పాలవుతున్నారు. మరి ప్రభుత్వాలు మారుతున్నా రైతు గుండె మంటలు ఆర్పే నాథుడే కరువయ్యూడు.
 
 ఇదీ పరిస్థితి
 నందిగాం మండలం సైలాడ పంచాయతీ దొడ్డరామచంద్రాపురం గ్రామంలో 300 ఎకరాలకుగాను 220 ఎకరాల్లో వరిపంట పూర్తిగా నాశనమైంది. గ్రామానికి చెందిన అట్టాడ వెంకటరావు తనకున్న ఆరు ఎకరాల్లో నాలుగు ఎకరాలు పూర్తిగా పాడైంది. రూ. 80 వేలు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నాడు. లండ ఎండయ్య ఐదెకరాల్లో రూ. 60 వేలు పెట్టుబడి పెట్టాడు. రెండెకరాలు పూర్తిగా పాడైంది. కొంచాడ రామారావు 5 ఎకరాల్లో ఉభాలు చేయగా 3 ఎకరాలు పూర్తిగా పాడైంది. అలాగే బర్ల కృష్ణమ్మ 15 ఎకరాల్లో నాట్లు వేయగా 10 ఎకరాలు నాశనమైంది. పూడి గణపతిరావుకు చెందిన 25 ఎకరాల్లో 15 ఎకరాలు పాడైంది. ఇలా రైతులంతా పంటను నష్టపోయూరు. కానీ  వ్యవసాయాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అలాగే దేవాడ, భరణిగాం, సైలాడ, వల్లభరాయపాడు, రౌతుపురం, శివరాంపురం గ్రామాల్లో వందల ఎకరాల్లో పంటలు పూర్తిగా నాశనమైంది. దీంతో చేసేది లేక తెగుళ్ల బారిన పడిన చేనుకు నిప్పుపెట్టారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతున్న మొరపెట్టుకుంటున్నాడు.
 
 వలసలే శరణ్యం
 నాకు సొంతంగా ఆరు ఎకరాలు ఉంది. మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. ఈ ఏడాది స్వర్ణ, సాంబమసూరి వేశాను. అయితే ప్రస్తుతం ఏడు ఎకరాలు పురుగుపోటు, దోమపోటుతో నాశనమయ్యాయి. సుమారు రూ. 80 వేలు ధాన్యం వ్యాపారి వద్ద అప్పుచేసి పెట్టుబడి పెట్టాను.  వచ్చే ఏడాది పొలాన్ని కౌలుకి ఇచ్చేసి కుటుంబంతో వలస వెళ్లిపోతాను.
 - అట్టాడ వెంకటేశం, రైతు, దొడ్లరామచంద్రాపురం
 
 ప్రభుత్వ నిర్ణయాలే రైతులను ముంచాయి
 ప్రభుత్వ నిర్ణయూలే రైతులను ముంచారుు. ఎన్నికల సమయంలో చంద్రబాబు రైతు రుణమాఫీ అన్నారు. తీరా ఇప్పుడు దాన్ని మరిచిపోయూరు. సెప్టెంబర్ 30లోపు రుణాలు రీ షెడ్యూలు చేయకపోవడం, ప్రస్తుతం బీమా కూడా అవకాశం లేకపోవడం, ఇదంతా ప్రభుత్వ వైఫల్యమే కారణం. రైతులను నట్టేట ముంచింది టీడీపీ ప్రభుత్వమే.
  - లండ ఎర్రయ్య, రైతు, భరణిగాం
 
 రైతులను విస్మరించిన     చంద్రబాబు
 చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయం దండగ అన్నా డు. ప్రస్తుతం ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు అన్ని విధాలా నష్టాలు చవిచూస్తున్నారు. రుణమాఫీ జరగక, పంటల బీమా వర్తించక, పై-లీన్, హుదూద్ తుపాను సాయం రైతులకు అందక అప్పులపాలవుతున్నారు.
 - కొంచాడ తాతయ్య, రైతు, దొడ్లరామచంద్రాపురం
 

Advertisement
Advertisement