ఇది పనసకాయ కాదు కొబ్బరికాయే! | Sakshi
Sakshi News home page

ఇది పనసకాయ కాదు కొబ్బరికాయే!

Published Sun, Jun 28 2015 6:07 PM

ఇది పనసకాయ కాదు కొబ్బరికాయే! - Sakshi

పిఠాపురం రూరల్ (తూర్పు గోదావరి) : పనసకాయలను చూసి ప్రేరణ పొందిందో లేక గుమ్మడికాయలతో పోటీ పడాలనుకుందో, ఏమో.. పిఠాపురం మండలంలోని జల్లూరులో ఓ కొబ్బరిచెట్టు ఉన్నట్టుండి భారీ కాయలను అందిస్తోంది. రైతు బండే శేషగిరిరావు తన మిత్రుడి వద్ద తీసుకుని నాటిన మొక్క పెరిగి మొన్నటి వరకూ అన్ని చెట్లకు మాదిరే మామూలు సైజులో కాయలు కాసింది.

ఇటీవల ఏమైందో, ఏమో ఈ చెట్టు భారీ కాయలు కాస్తూ అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. దాన్ని చూసిన వారు ‘ఇది నారికేళం కాదు.. భారీకేళం’ అంటున్నారు. అంత పెద్ద కాయల పరిమాణానికి ముచ్చటపడ్డ స్థానికులు ఆ చెట్టు విత్తనాలను తీసుకువెళుతున్నారని శేషగిరిరావు చెప్పారు.            - పిఠాపురం రూరల్ 1

Advertisement
Advertisement