బాల్యవివాహానికి సిద్ధమైన తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ | Sakshi
Sakshi News home page

బాల్యవివాహానికి సిద్ధమైన తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌

Published Fri, Dec 14 2018 7:38 AM

ICDS Officials Counseling To Girl Parents - Sakshi

విశాఖపట్నం ,నర్సీపట్నం:  ఓ బాలికకు వివాహం చేసేందుకు సన్నాహాలు చేసిన తల్లిదండ్రులకు ఐసీడీఎస్‌ అధికారులు కౌన్సెలింగ్‌ ఇచ్చి, వారి నుంచి హామీ పత్రం తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టంలో ఏడో   తరగతి చదువుతున్న విద్యార్థినికి ఆమె   తల్లిదండ్రులు పెళ్లి నిశ్చయించారు. విషయం తెలుసుకుని సీడీపీవో శ్రీకళ, సిబ్బందితో కలిసి గురువారం బాలిక ఇంటికి వెళ్లారు. ఆమె  తల్లిదండ్రులు  రాజా, లక్ష్మీలకు నచ్చజెప్పారు. చిన్నతనంలో పెళ్లి చేస్తే ఏర్పడే సమస్యల గురించి వివరించారు.  ఆ ప్రయత్నం విరమించుకోవాలని సూచించారు. మైనర్లకు వివాహం చేస్తే  శిక్షార్హులవుతారని సీడీపీవో తెలిపారు. చదివించడం భారమైతే తాము చదివిస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. వివాహం జరిపించబోమని వారి నుంచి హామీ పత్రం రాయించుకున్నారు. కౌన్సెలింగ్‌లో గ్రామపెద్దలు శెట్టి మోహన్‌ తదితర్లు  ఉన్నారు.

Advertisement
Advertisement