Sakshi News home page

10 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్

Published Fri, Sep 6 2013 4:52 AM

ICET 2013 counselling procedure and schedule

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకోసం ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియును ఈనెల 10న ప్రారంభించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నెల 10నుంచి 15వరకు సర్టిఫికెట్ల తనిఖీ, 15నుంచి 21 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు, 23వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని నోటిఫికేషన్ తెలిపింది. సర్టిఫికెట్ల తనిఖీ కోసం ఏర్పాటు చేసిన సహాయక కేంద్రా ల వివరాలను ఈనెల 8న https://apicet.nic.in వెబ్‌సైట్‌లో పొందుపరుస్తావుని అడ్మిషన్ల క్యాంపు ప్రధా న అధికారి డాక్టర్ కె. రఘునాథ్ తెలిపారు. వికలాంగు లు, సైనికోద్యోగుల పిల్లలు, ఎన్‌సీసీ, క్రీడలు, ఆంగ్లో ఇండియన్ తదితర ప్రత్యేక కేటగిరీల కింద రిజర్వేషన్ కింద సీటు పొందదలుచుకున్న అభ్యర్థులు హైదరాబాద్ ,. మాసబ్‌ట్యాంక్‌వద్ద సాంకేతిక విద్యాభవన్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను వెబ్‌సైట్లో పొందుపరిచారు.
 
 25,700 మంది వెబ్‌ఆప్షన్లు నమోదు
 ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 3, 4 తేదీల్లో 1 నుంచి 40 వేల ర్యాంకు వరకు నిర్వహించిన వెబ్‌కౌన్సెలింగ్‌లో 25,700 మంది అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లు ఇచ్చినట్టు రఘునాథ్ తెలిపారు. 40 వేల లోపు 26వేల మంది ర్యాంకర్లు సర్టిఫికెట్ల తనిఖీకి హాజరైనా, 300 మంది వెబ్‌ఆప్షన్లు నమోదు చేయలేదన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement