అర్ధంతరంగా పింఛన్లు రద్దు చేస్తే పేదలు బతికేదెలా? | Sakshi
Sakshi News home page

అర్ధంతరంగా పింఛన్లు రద్దు చేస్తే పేదలు బతికేదెలా?

Published Fri, Oct 10 2014 12:53 AM

అర్ధంతరంగా పింఛన్లు రద్దు చేస్తే పేదలు బతికేదెలా? - Sakshi

ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ నేత వాసిరెడ్డి పద్మ
పేదలపై కక్షగట్టి పింఛన్లు తొలగించడం సమంజసం కాదు

 
హైదరాబాద్: పేద ప్రజలపై కక్ష కట్టి వారి పింఛన్లు తొలగించడం ఏమాత్రం సమంజసం కాదని వైఎస్సార్‌సీపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పలు జిల్లాల్లో వేలకు వేలు వృ ద్ధుల, వితంతువుల, వికలాంగుల పింఛన్లు రద్దు చేయడం పట్ల ఆ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అర్ధంతరంగా పింఛన్లు తొలగిస్తే లబ్ధిదారుల జీ వితాలు ఏం కావాలి? వారెలా బతకాలి? అని ఆ మె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాబు ప్రభుత్వం స్వల్ప కాలంలోనే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకుందన్న ఆమె.. తూర్పు గోదావరి జిల్లాలోని దివాన్‌చెరువు పంచాయతీ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. అక్కడ 16 వార్డులకు గాను వైఎస్సార్‌సీపీ 12 గెల్చుకుందని, అధికారపక్షం ఒక్కటంటే ఒక్కటి మాత్రమే నెగ్గిందని తెలిపారు. ఇప్పట్లో ఎన్నికలేమీ లేవన్న ధైర్యంతోనే పింఛన్లను తొలగిస్తూ తానిచ్చిన వాగ్దానాలను చంద్రబాబు తుంగలో తొక్కారని ఆమె విమర్శించారు. తన పింఛన్‌ను రద్దు చేశారని సారా వ్యతిరేకోద్యమ సారథిగా ప్రశంసలు అందుకున్న రోశమ్మ విలపించారంటే పింఛన్ల తొలగింపు ఎలా సాగుతోందో ఇట్టే తెలుస్తోందన్నారు.

రోశమ్మ మీకు ఓటు వేయలేదని పింఛన్ రద్దు చేశారా? మీరు మద్య నిషేధం ఎత్తేసినందుకు కలత చెంది, ఇకపై ఆమె మద్దతు మీకు ఉండదనా? అని ఆమె బాబును ప్రశ్నించారు. రోశమ్మలాంటి బాధితులు చాలా మంది ఉన్నారని, వారందరూ తమ బాధను పత్రికల వద్ద వెళ్లబోసుకోలేరని ఆమె చెప్పారు. చిత్తూరు జిల్లాలో 84,167, తూర్పు గోదావరిలో 90,981, విశాఖపట్నంలో 20,220, పశ్చిమగోదావరిలో 23,720 పింఛన్లు తొలగించారని ఆమె వివరించారు. సరస్వతి సి మెంట్స్‌లో వైఎస్ భారతి ఒక డెరైక్టరుగా ఉండటమే పాపమన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పద్మ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ ఫ్యాక్టరీకి ఇచ్చిన గనుల లీజును రద్దు చేయడం సరికాదన్నారు. సుజనాచౌదరి, సి.ఎం. రమేశ్ కొనుగోలు చేసిన భూములను కూడా రైతులకు తిరిగి ఇచ్చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. ఇది సరస్వతి సిమెంట్స్‌పై రాజ కీయ దాడి తప్ప మరొకటి కాదన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement