భారీగా మద్యం స్వాధీనం | Sakshi
Sakshi News home page

భారీగా మద్యం స్వాధీనం

Published Mon, Apr 8 2019 2:06 PM

Illegal Transporting Of Alchohol Bottels Seized In Srikakulm - Sakshi

సాక్షి, శ్రీకాకుళం రూరల్‌: ప్రోహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తరఫున శని, ఆదివారాల్లో చేపట్టిన దాడుల్లో భారీగా మద్యం సీజ్‌ చేసినట్లు అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ కమిషన్‌ ఎస్‌.సుకేష్‌ తెలిపారు. లావేరు మండలం వెంకటాపురం గ్రామం వద్ద జరిపిన దాడుల్లో నక్క రమణ అనే వ్యక్తి వద్ద 40 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎల్‌ఎన్‌పేట మండలం వద్ద జరిపిన దాడుల్లో 96 మద్యం సీసాలు, ఒక మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. శ్రీకాకుళం పెదపాడు గ్రామం వద్ద 144 మద్యం సీసాలు, ఒక ఆటోరిక్షాను పట్టుకున్నాన్నారు. అక్రమంగా మద్యం తరలించిన వారిని అరెస్టు చేశామన్నారు. ఈ దాడుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శ్రీనివాసరావు, ఎస్‌.వి.రమణమూర్తి, శేషగిరిరావు, సిబ్బంది పాల్గొన్నారు.

లోపెంటలో 160 మద్యం బాటిళ్ల పట్టివేత 
లావేరు: మండలంలోని లోపెంట గ్రామంలో అనధికారికంగా నిల్వ ఉంచిన 160 మద్యం బాటిళ్లను శనివారం రాత్రి లావేరు ఎస్‌ఐ చిరంజీవి, పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన జీరు అప్పలరాజు ఇంటిలో అనధికారంగా మద్యం బాటిళ్లు నిల్వ ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందిందని ఎస్‌ తెలిపారు. గ్రామానికి వెళ్లి అప్పలరాజు ఇంటిలో తనిఖీలు నిర్వహించామన్నారు. పట్టుబడిన 160 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అప్పలరాజును అదుపులోనికి తీసుకుని స్టేషన్‌కు తరలించామన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

రణస్థలంలో 240 మద్యం బాటిళ్లు..
రణస్థలం: మండలంలోని కొచ్చెర్ల పంచాయతీ కొత్తముక్కాం సమీపంలో జె.ఆర్‌.పురం ప్రోహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ ఎ.గణపతిబాబు ఆధ్వర్యంలో ఆదివారం తనిఖీలు చేపట్టారు. వి.ఎన్‌.పురం గ్రామానికి చెందిన సుగ్గు శ్రీనివాసరావు ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తున్న 240 మద్యం బాటీళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. మద్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏఎస్‌ఐలు టి.వి. వి.సత్యనారాయణ, ఎం.విజయలక్ష్మి, సిబ్బంది ఉన్నారు.

ఎల్‌.ఎన్‌.పేటలో 63 మద్యం బాటిళ్లు..
ఎల్‌.ఎన్‌.పేట: మండలంలోని తురకపేట సెంటర్, మిరియాపల్లి గ్రామాలకు చెందిన గెంబలి శ్రీనివాసరావు, కోర్ను గోవిందరావుల వద్దనున్న అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు సరుబుజ్జిలి ఎస్‌ఐ డి.విజయ్‌కుమార్‌ ఆదివారం తెలిపారు. వీరిద్దరు 63 మద్యం బాటిళ్లు తీసుకుని వెళుతుండగా పట్టుకున్నామన్నారు.

పాతపట్నంలో 46 మద్యం బాటిళ్లు.. 
పాతపట్నం: మండలంలోని మాకివలస గ్రామం సమీపంలో  అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లును అధికారులు పట్టుకున్నారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ పి.జయంత్‌ ప్రసాద్, బి.హెచ్‌.ప్రవీణ్‌లు 20 బీరు బాటిళ్లు, 10 మద్యం బాటిళ్లను పట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారని ఎస్‌ఐ ఇ.చిన్నంనాయుడు ఆదివారం తెలిపారు. సీది నుంచి ఆర్‌.ఎల్‌.పురం గ్రామం వైపు మద్యం బాటిళ్లతో ఆర్‌.ఎల్‌.పురం గ్రామానికి చెందిన రెడ్డి తిరుపతి పట్టుకుని వెళుతుండగా మాకివలస వద్ద పట్టుకుని కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. మండలంలోని రొంపివలస జంక్షన్‌ వద్ద రొమదల గ్రామానికి చెందిన ఈగల వేణుగోపాల్‌ 16 మద్య బ్యాటిళ్లతో వెళుతుండగా ఫ్లయింగ్‌ స్క్వాడ్, పోలీసులు పట్టుకున్నారని ఎస్‌ఐ ఇ.చిన్నంనాయుడు తెలిపారు. మద్యం బ్యాటిళ్లను పోలీసు స్టేషన్‌కు తరలించామన్నారు. 

కొత్తూరులో 384 మద్యం బాటిళ్లు.. 
కొత్తూరు: మండలంలోని మెట్టూరు కూడలిలో 384 మద్యం బాటిళ్లను(90 ఎంఎల్‌) ఆదివారం స్థానిక ఎస్‌ఐ రవికుమార్‌ తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఈ మద్యాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ఎ.సత్యనారాయణపై కేసు నమోదు చేశామన్నారు. మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్నికలు విధుల్లో ఇంతవరకు 1000 మద్యం బాటిళ్లు పట్టుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

నరసన్నపేటలో 170 మద్యం బాటిళ్లు..
నరసన్నపేట: ఆమదాలవలస మండలం అలికాం నుంచి అక్రమంగా నరసన్నపేట మండలంలోని లకిమేరకు చెందిన బి.లక్ష్మణరావు తరలిస్తున్న 170 మద్యం బాటిళ్లను ఎన్నికల స్క్వాడ్‌ బృందం పట్టుకుని సీజ్‌ చేసింది. మండలంలోని కోమర్తి వద్ద బృందం సభ్యులు ట్రైనీ ఎస్‌ఐ షేక్‌ ఖాదర్‌ఖాన్, డీటీ వెంకటేష్, ఏఎస్‌ఐ వైకుంఠరావులు ఆదివారం తనిఖీలు చేస్తుండగా మద్యం పట్టుబడింది. మద్యాన్ని సీజ్‌ చేసి కేసు నమోదు చేశామని  నరసన్నపేట ఎస్‌ఐ నారాయణ స్వామి తెలిపారు. ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నందున మద్యం అమ్మకాలు చేపట్టడం, తరలించడం వంటివి చేయకూడదన్నారు. 
నలుగురు బెల్టుషాపు నిర్వాహకులపై కేసులు.. 
ఆమదాలవలస: ఆమదాలవలస ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో శ్రీకాకుళం ఎన్‌ఫోర్స్‌మెంట్, సబ్‌ డివిజినల్‌ టాస్క్‌పోర్స్, స్టేషన్‌ హైస్‌ ఆఫీసర్, సిబ్బంది కలిసి నిర్వహించిన దాడుల్లో శని, ఆదివారాల్లో నాలుగు బెల్టు దుకాణాలపై కేసులు నమోదు చేసినట్టు ఎక్సైజ్‌ సీఐ జి.రమేష్‌బాబు తెలిపారు. ఎల్‌.ఎన్‌.పేటలో 94, సరుబుజ్జిలిలో 15, దూసిలో 93, ఆమదాలవలసలో 54 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నలుగురు బెల్టుషాపు నిర్వాహకులను అరెస్టు చేసినట్లు మొత్తం 260 మద్యం సీసాలను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని న్యాయం స్థానం ముందు హాజరుపరుస్తామన్నారు.

రేగిడిలో 96 మద్యం బాటిళ్లు..
రేగిడి: మండలంలోని ఉంగరాడ గ్రామంలో ఆదివారం స్థానిక పోలీసులు 91 మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఓ బెల్టుషాపు వద్ద వీటిని పట్టుకున్నట్లు ఎస్‌ఐ కె. వెంకటేష్‌ తెలిపారు. మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.

240 మద్యం బాటిళ్లు..  
కాశీబుగ్గ: పలాస మండలం వీరబధ్రాపురం గ్రామం వద్ద ఆదివారం తెల్లవారు జామున 240 మద్యం బాటిళ్లతో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు యువ కార్యకర్తలు పట్టుబడ్డారు. కాశీబుగ్గ ఎక్సైజ్‌ సీఐ మురళీధర్‌ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఎన్నికల అధికారి అదేశాల మేరకు నిర్వహించిన తణిఖీల్లో వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరి పంచాయతీ వెంకటాపురం గ్రామానికి చెందిన నీలాపు అశోక్‌కుమార్, అనంతగిరి కాలనీకి చెందిన మరడ ప్రశాంత్‌లు ద్విచక్ర వాహనంపై 240 బాటిళ్లు తరలిస్తుండగా పట్టుబడ్డారన్నారు.

వెంకటాపురం జన్మభూమి కమిటీ సభ్యుడు మరడ దుర్యోధనరెడ్డి అదే గ్రామానికి చెందిన మరడ మల్లేష్‌రెడ్డికి అందజేయాలనే సూచన మేరకు వీరు పక్క గ్రామమైన వీరభద్రాపురం గ్రామం నుంచి తీసుకువచ్చినట్లు తెలిపారు.  పెద్ద ఎత్తున మద్యం నిల్వలు అనంతగిరి, వీరభద్రాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు అనుమానిస్తున్నామని, తప్పనిసరిగా ఆ నిల్వలు పట్టుకుంటామన్నారు. ఇద్దరు యువకులను మీడియా ముందు ప్రవేశపెట్టి వారిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామని చెప్పారు. ఎస్‌ఐలు ప్రభాకర్, కృష్ణారావు, సిబ్బంది పాల్గొన్నారు.  

1/3

రణస్థలం: పట్టుకున్న మద్యాన్ని చూపిస్తున్న ఎక్సైజ్‌ పోలీసులు

2/3

రేగిడి:పోలీసులు పట్టుకున్న మద్యం బాటిళ్లు

3/3

నరసన్నపేట: పట్టుబడిన మద్యం బాటిళ్లతో స్క్వాడ్‌ బృందం

Advertisement
Advertisement