ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం | Sakshi
Sakshi News home page

ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం

Published Fri, Feb 14 2014 2:31 AM

Impact on production

కొత్తగూడెం, న్యూస్‌లైన్ : ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో కంపెనీ నిర్ధేశించుకున్న వార్షిక ఉత్పత్తి లక్ష్యం అందనంత దూరంలో ఉంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం 45 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఉన్న కాస్త కాలంలోనైనా సర్వశక్తులు ఒడ్డి పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేపడదామని అనుకుంటే.. ఈనెలలో మేడారం జాతర, టీబీజీకేఎస్ ఎన్నికల కారణం గా తీవ్ర ప్రభావం పడనుంది. ఇప్పటికే జాతర వల్ల కార్మికుల హాజరు శాతం తగ్గింది. ఈ పరిస్థితి మరో రెండు, మూడు రోజులు ఇలానే ఉండేలా కనిపిస్తున్నాయి.

దాని తర్వాత ఈనెల 23న గోదావరిఖనిలో జరిగే టీబీజీకేఎస్ అంతర్గత ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆ యూనియన్‌కు సంబంధించిన కార్మికులు వెళ్లాల్సి ఉం టుంది. దీంతో మరో మూడు రోజల పాటు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీబీజీకేఎస్‌లో సభ్యత్వం కలిగిన వారు 41 వేల మంది ఉండగా ఇందులో కనీసం 50 శాతమైనా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు గోదావరిఖనికి తరలించాల ని పోటీలో ఉన్న రెండు వర్గాలు వ్యూహాలు పన్నుతున్నాయి. దూరంలో ఉన్న కొత్తగూడెం రీజియన్ నుంచి గోదావరిఖని వెళ్లి రావాలంటే కనీసం ఒక రోజు సమయం పడుతుంది.

ఒకరోజు ముందగానే కార్మికులను తరలించాలని ఆయా నాయకులు ప్రణాళికలు రూపొందిం చా రు. కనీసం 20వేల మందైనా వెళ్లే అవకాశముం దని సింగరేణి ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్ర త్యామ్నాయ ఏర్పాట్లపై కసరత్తు చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఎన్నికలు జరుగుతుండటంతో బహిరంగంగా కార్మికులను ఎన్నికలకు వెళ్లవద్దని చెబితే కంటెమ్ట్ ఆఫ్ కోర్టు కింద వచ్చే అవకాశం ఉండటంతో యాజమాన్యం ఆ ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం.

భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులు ఎక్కువ సంఖ్యలో వెళ్లినా ఉత్పత్తిపై పెద్దగా ప్రభావం చూపదని, ఓపెన్‌కాస్టులో పనిచేసే వారు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భా విస్తోంది. వారిని నేరుగా కలిసి పరిస్థితులు వివరించనున్నట్లు తెలిసింది. ఎన్నికల నేపథ్యంలో రెండు వర్గాల నాయకులు కార్మికులను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉండటంతో అవసరమైతే పోలీస్, రెవెన్యూ అధికారుల సహాయం తీసుకోవాలని యాజమాన్యం ఆలోచిస్తోంది.

Advertisement
Advertisement