చీరాలలో న్యాయసేవా సమాచార కేంద్రం ప్రారంభం | Sakshi
Sakshi News home page

చీరాలలో న్యాయసేవా సమాచార కేంద్రం ప్రారంభం

Published Sat, Jun 14 2014 2:33 AM

చీరాలలో న్యాయసేవా సమాచార కేంద్రం ప్రారంభం

చీరాల రూరల్ : ఈ-కోర్ట్సు ఆధ్వర్యంలోని న్యాయసేవా సమాచార కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి ఎ. రాధాకృష్ణ చెప్పారు. స్థానిక కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన న్యాయసేవా సమాచార కేంద్రాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. తొలుత స్థానిక సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శాంతి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శివశంకరరెడ్డి, న్యాయవాదులు కలసి జిల్లా జడ్జిని సాదరంగా ఆహ్వానించారు. అన ంతరం ఆయన కోర్టు భవన సముదాయాలను పరిశీలించారు. ఆవరణలోని పార్కును తిలకించారు. పార్కులో పచ్చదనాన్ని చక్కగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారని కితాబునిచ్చారు.
 
అలానే పార్కులో నూతనంగా ప్రారంభించబోయే న్యాయదేవత విగ్రహాన్నీ పరిశీలించారు. అనంతరం పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆయన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన త ర్వాత నవ్యాంధ్ర ప్రదేశ్‌లో మొట్టమొదటి సారిగా చీరాలలోనే ఈ-కోర్ట్సు ఆధ్వర్యంలో న్యాయసేవా సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చె ప్పారు. ఈ ఘనత చీరాల కోర్టుకే దక్కుతుందన్నారు. నూతనంగా ఏర్పాటు చే సిన ఈ న్యాయసేవా సమాచార కే ంద్రం ద్వారా న్యాయవాదులకు, కక్షిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు.
 
 కోర్టులో ప్రతి కేసును ఆన్‌లైన్‌లో పెట్టడం వలన కంప్యూటర్ ద్వారా ఇంటి నుంచి కూడా కేసు ఏ దశలో ఉంది, ఇరుపక్షాల న్యాయవాదులు ఎవరు, కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చునన్నారు. అనంతరం న్యాయమూర్తిని న్యాయవాదులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శాంతి, జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శివశంకర్‌రెడ్డి, న్యాయవాద సంఘ అధ్యక్షుడు దూళిపాళ్ల శ్రీనివాసరావు,న్యాయవాదులు కర్నేటి రవికుమార్, ఎం.వి.చలపతిరావు, ఏజీపీ సాయిబాబు, కరేటి రవికుమార్‌రెడ్డి, మిక్కిలి పుల్లయ్య, ఎ.సత్యనారాయణ, పింజ ల ప్రసాద్, సిహెచ్. మస్తాన్‌రావు, గౌరవ రమేష్‌బాబు, బూదరాజు శశికిరణ్, రాజు వెంకటేశ్వరరెడ్డి, బోయిన రమేష్‌బాబు, చల్లా సురేష్, బిఎన్. మూర్తి, బత్తుల అమృత్‌కుమార్, మంకెన అశోక్‌కుమార్  పాల్గొన్నారు.

Advertisement
Advertisement