నెలరోజుల్లో అట్రాసిటీ కేసులను పరిష్కరించాలి | Sakshi
Sakshi News home page

నెలరోజుల్లో అట్రాసిటీ కేసులను పరిష్కరించాలి

Published Wed, Oct 9 2013 3:06 AM

In one month Antracity cases should be take action

కలెక్టరేట్, న్యూస్‌లైన్: పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులను నెలరోజుల్లో పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ అన్నారు. మంగళవారం తన చాంబర్‌లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులపై రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో విచారణతోపాటు, చార్జీషీటు దాఖలు, బాధితురాలికి చెల్లించాల్సిన పరిహారాన్ని సైతం అప్పటిక ప్పుడే అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ,ఎస్టీ కేసుల విచారణలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ యేడాది 77కేసులు పెండింగ్‌కు పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. వీటిలో 71 కేసులకు సంబంధించి ఎస్పీ కార్యాలయం నుంచి నివేదికలు రావాల్సి ఉందన్నారు. వీటిపై ఆర్డీఓలు, డిఎస్పీలు శ్రద్ధ తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. నారాయణపేట్, నాగర్‌కర్నూల్ డివిజన్లలో ఎక్కవ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.
 
 చార్జీషీట్‌లో జాప్యం తగదు
 నమోదైన కేసులపై విచారణ చేపట్టిన తర్వాత చార్జిషీట్ దాఖలు జాప్యం జరుగుతుందని, ఈ కారణంగా బాధితులకు సకాలంలో న్యాయం చేయలేకపోతున్నామని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది గతంలో కన్నా ఎక్కువ కేసులు నమోదైనా, పరిష్కారంలో మాత్రం ఏలాంటి పురోగతి లేదన్నారు. మహబూబ్‌నగర్ డిఎస్పీ మల్లికార్జున్ మాట్లాడుతూ, విచారణ పూర్తి చేసిన కేసులకు సంబంధించి వెంటనే చార్జీషీటు దాఖలు చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన ఒక కాపీని కలెక్టరేట్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. కొన్ని కేసుల్లో మాత్రమే పై అధికారుల అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు ఆయన కలెక్టర్‌కు వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ విషయంలో సంక్షేమ శాఖ, కలెక్టరేట్ కార్యాలయానికి మద్య కమ్యూనికేషన్ గ్యాప్ ందని,  ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని డిడి జయప్రకాష్‌ను ఆదేశించారు.
 
 రూ.19లక్షలు పంపిణీ
 గత ఏడాదికి నమోదైన కేసుల్లో 43 కేసులను పరిష్కరించి, బాధితులకు రూ..19లక్షల పరిహారాన్ని అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పుడు నమోదైన కేసులను త్వరిత గతిన పరిష్కరిస్తే బాధితులకు పరిహారాన్ని అందజేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.  ఈ కేసుల్లో సాక్షులుగా ఉన్న వారికి ప్రభుత్వ పరంగా చెల్లించే డబ్బులు సరిపోవడంలేదనే ఫిర్యాదులు వస్తే పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు కార్యక్రమంలో జేసి ఎల్.శర్మణ్, ఏఎస్పీ ప్రదీప్ రెడ్డి, ఏజేసి డా.రాజారాం, డిఆర్వో రాంకిషన్, సోషల్ వెల్ఫేర్ డిడి జయప్రకాష్, ఆర్డీఓలు హన్మంతరావు, యాస్మిన్ బాష, డిఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement