ఇన్‌కంట్యాక్స్ పరిమితి పెంపునకు కృషి | Sakshi
Sakshi News home page

ఇన్‌కంట్యాక్స్ పరిమితి పెంపునకు కృషి

Published Tue, Sep 17 2013 12:29 AM

income tax Effort to increase the limit

 గోదావరిఖని, న్యూస్‌లైన్ : సింగరేణి గని కార్మికులకు 9వ వేతన సవరణ జరిగిన తర్వాత ఆదాయపు పన్ను అధికంగా చెల్లించాల్సి వస్తోం ది.. పన్ను పరిమితిని రూ.3లక్షలకు పెంచడానికి త్వరలో ప్రధాన మంత్రిని కలవనున్నట్లు పెద్దప ల్లి ఎంపీ జి.వివేక్ తెలిపారు. సోమవారం రామగుండం-1 ఏరియా జీడీకే-1 గనిపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతికి విరుద్ధమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రాణాల ను పణంగా పెట్టి దేశానికి వెలుగులు పంచుతు న్న గని కార్మికులకు దేశ సరిహద్దులో పనిచేసే సైనికుల మాదిరిగానే ఆదాయపు పన్ను నుంచి మినహించాలని కేంద్రాన్ని కోరనున్నట్లు చెప్పా రు. లాభాలలో 25 శాతం ఇప్పించడానికి తన వంతు సహకారం అందిస్తాన్నారు. 
 
కష్టపడిన కార్మికులకు సముచితమైన వాటా ఇవ్వాల్సిందేనని చెప్పారు. తన తండ్రి వెంకటస్వామి మాదిరిగానే సింగరేణి కార్మికుల కోసం తాను ఎంతటి సేవచేయడానికైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ కోసం అవసరమైతే సమ్మె చేయడానికి ముందు కు రావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లే శం, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీ స్వయంగా కార్మికుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
 

Advertisement
Advertisement