జిల్లాలో పెరిగిన ఎంపీటీసీ స్థానాలు | Sakshi
Sakshi News home page

జిల్లాలో పెరిగిన ఎంపీటీసీ స్థానాలు

Published Thu, Aug 15 2013 6:45 AM

Increased MPTC positions in the district

ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల(ఎంపీటీసీ) సంఖ్య పెరిగింది. 2001 జనాభా ప్రకారం  జిల్లాలో 735 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 2011 జనాభాను ఆధారం చేసుకోవడంతో వాటి సంఖ్య 790 అయింది. జిల్లాలో కొత్తగా 55 ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. దర్శి మండలంలో నాలుగు, మార్టూరు, పొదిలి, సింగరాయకొండ, యర్రగొండపాలెం మండలాల్లో మూడు చొప్పున ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. సంతనూతలపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో ఒకటి చొప్పున ఎంపీటీసీ స్థానాలు తగ్గడం గమనార్హం.
 
ఎంపీటీసీ ముసాయిదా జాబితాను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ బుధవారం విడుదల చేశారు. జిల్లాపరిషత్ కార్యాలయంతోపాటు అన్ని మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో జాబితాలు అందుబాటులో ఉంచారు. తాజాగా ప్రకటించిన ఎంపీటీసీ స్థానాలపై ఈనెల 21వ తేదీలోపు అభ్యంతరాలు తెలియజేయాలని కలెక్టర్ కోరారు. ఈనెల 27వ తేదీ ఎంపీటీసీల తుది జాబితాను ప్రకటించనున్నారు. మండలాల వారీగా 2001 జనాభాను అనుసరించి ఉన్న ఎంపీటీసీ స్థానాలు, 2011 జనాభా అనుసరించి ఏర్పాటు చేసిన ఎంపీటీసీ స్థానాల వివరాలు ఈవిధంగా ఉన్నాయి.
 
 మండలం పేరు 2001 2011
  జనాభా జనాభా 
  {పకారం {పకారం
 అద్దంకి 14 14
 బల్లికురవ 14 15
 చీమకుర్తి 12 14
 చినగంజాం 12 12
 చీరాల 22 24
 యద్దనపూడి 08 08
 ఇంకొల్లు 14 14
 జె.పంగులూరు 13 13
 
 కారంచేడు 11 11
 కొరిశపాడు 13 14
 కొత్తపట్నం 14 14
 మద్దిపాడు 14 15
 మార్టూరు 18 21
 నాగులుప్పలపాడు 20 19
 ఒంగోలు 08 08
 పర్చూరు 16 16
 సంతమాగులూరు 15 17
 
 సంతనూతలపాడు 13 12
 టంగుటూరు 17 18
 వేటపాలెం 19 21
 సీఎస్ పురం 11 13
 దర్శి 21 25
 దొనకొండ 12 14
 
 గుడ్లూరు 12 12
 హనుమంతునిపాడు 09 09
 కొనకనమిట్ల 14 14
 కందుకూరు 09 11
 కనిగిరి 14 14
 కొండపి 10 12
 
 కురిచేడు 11 12
 లింగసముద్రం 09 11
 మర్రిపూడి 11 11
 ముండ్లమూరు 15 16
 పీసీ పల్లి 10 11
 పామూరు 16 18
 పొదిలి 16 19
 
 పొన్నలూరు 10 12
 సింగరాయకొండ 16 19
 తాళ్లూరు 13 14
 తర్లుపాడు 09 10
 ఉలవపాడు 14 15
 వలేటివారిపాలెం 10 10
 వెలిగండ్ల 10 10
 జరుగుమల్లి 12 12
 అర్థవీడు 10 10
 బేస్తవారిపేట 14 15
 కంభం 13 14
 దోర్నాల 11 13
 గిద్దలూరు 14 14
 కొమరోలు 12 12
 మార్కాపురం 14 15
 
 పుల్లలచెరువు 14 15
 పెద్దారవీడు 11 12
 రాచర్ల 10 10
 త్రిపురాంతకం 16 18
 యర్రగొండపాలెం 15 18
 మొత్తం 735 790

Advertisement
Advertisement