సాయం అందిస్తున్న హెల్పింగ్‌ హాండ్స్‌

20 Apr, 2020 15:05 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఎక్కడి కార్యకలాపాలు అక్కడ నిలిచిపోయాయి. దీంతో చాలా మంది నిరాశ్రయులకు,పేదలకు పూట గడవక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలు కూడా దాతలు లేక దీనంగా సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో అనాధ బాలలు, వృద్ధుల పరిస్థితి మరింత దిగజారింది. సాయం చేసే వారు లేక ఆహారం దొరకక విలవిలలాడుతున్నారు. అలాంటి వారికి అండగా పలు స్వచ్ఛంధ సంస్థలు, చారిటబుల్‌ ట్రస్ట్‌లు, సామాన్యలు సైతం తమకు తోచినంత సాయం చేస్తూ ఆదుకుంటున్నాయి. 

గత 9 సంవత్సరాలుగా అనేక మంది సాయాన్ని అందిస్తున్న ఇండియన్‌ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ లాక్‌డౌన్‌ కాలంలో వృద్ధులకు తమ సహాయ సహకారాలను అందిస్తోంది. చిన్నారులకు ఆహారం, విద్య అందిస్తోంది. ఎంతో మంది వృద్ధులను అక్కున చేర్చుకొని ఆదరిస్తోంది. 2011 నుంచి సేవలు అందిస్తున్న ఈ ట్రస్ట్‌ లాక్‌డౌన్‌ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అన్ని విధాల అండగా నిలబడుతుంది. వృద్ధులకు మూడు నెలలకు సరిపడా ఆహారధాన్యాలను, నిత్యవసర సరుకులను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. 


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు