పదవి వద్దు.. పరిశ్రమలు కావాలి | Sakshi
Sakshi News home page

పదవి వద్దు.. పరిశ్రమలు కావాలి

Published Mon, Mar 3 2014 12:39 AM

పదవి వద్దు.. పరిశ్రమలు కావాలి - Sakshi

  •      రైతుల కళ్లలో సంతోషం చూడాలన్నదే ఆకాంక్ష
  •      మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
  •  దోమలపల్లి(నల్లగొండ రూరల్), న్యూస్‌లైన్: ఎన్నికలఅనంతరం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తనకు పిలిచి మంత్రి పదవి ఇచ్చినా తీసుకోను.. నా తమ్ముళ్లకు, అక్కాచెల్లెల్లకు ఉద్యోగాలు కల్పించేందుకు నాలుగు భారీ పరిశ్రమలు కావాలని కోరుతా.. అని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నా రు. నల్లగొండ మండలం దోమలపల్లిలో సర్పంచ్ అమృత ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడారు.

    పదవుల కోసం తాను పోటీ చేయడం లేదు. పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగులకు ఉద్యో గ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సాగునీరు అందించి వారిలో సంతోషం చూడాలనేదే తన తపన అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను లక్ష భారీ మెజార్టీతో గెలిపించి తనపై బాధ్యత పెంచాలన్నారు. ఒక కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటా.. అని అన్నారు. పార్టీలకతీ తంగా ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశా రు. వచ్చే ఏడాదిలో బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు పూర్తి చేసి చెరువులు నింపుతామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన సోనియా దేవత లాంటిదని, ఆమె రుణం తీర్చుకునేందుకు  ఐక్యం గా ఓట్లు వేయాలన్నారు.
     
    ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి ఓ రౌడీ
     
    సూర్యాపేట ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి ఓ రౌడీ అని, ఆయన తన కొడుకుకు టికెట్ కావాలంటూ బెదిరింపులకు దిగితే ఎవరూ బయపడరని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంత్రులు వారి నియోజకవర్గాల్లోకి వెళ్తే ప్రజలు వారిని పట్టించుకోవడం లేదు. కనీసం వారికి చప్పట్లు కూడా కొడతలేరన్నారు. జిల్లా అంతటా తన అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. ఎంపీ రాజగోపాల్‌రెడ్డి, దళిత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ఎన్ని ఇబ్బందులు పెట్టినా భగవంతుడు చూస్తాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం మెడికల్ కళాశాల నిర్మా ణం కోసమే మొట్టమొదటి శంకుస్థాపన చేస్తానని భరోసా ఇచ్చారు.

    తెలంగాణకు వ్యతిరేకమైన సీపీఎంకు ఓట్లు వేసి నా, అదే పార్టీలో ఉన్నా అవమానకరం అని అన్నారు. అంతకుముం దు గ్రామం లో స్వాగత ర్యాలీ నిర్వహించారు. పలువురు సీపీఎం, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య, యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు జి.మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పనస శంకర్‌గౌడ్, దొనకల్లు  సర్పంచ్ అయ్యాడపు ప్రకాశ్‌రెడ్డి, నర్సింగ్‌భట్ల సర్పంచ్ జకీర్ తాజ్, బొబ్బలి మహేందర్‌రెడ్డి, తు మ్మల లింగస్వామి యాదవ్, కల్లూరి వెంకటేశంగౌడ్ పాల్గొన్నారు.
     

Advertisement
Advertisement