అంతర్ జిల్లా దొంగ అరెస్ట్ | Sakshi
Sakshi News home page

అంతర్ జిల్లా దొంగ అరెస్ట్

Published Sat, Nov 1 2014 3:00 AM

అంతర్ జిల్లా దొంగ అరెస్ట్ - Sakshi

ఆత్మకూరు (కర్నూలు) : ఆత్మకూరుతో పాటు వివిధ జిల్లాల్లో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగల ముఠా సభ్యుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు. శుక్రవారం డీఎస్పీ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. దొంగల ముఠా సంచరిస్తున్నట్లు తమకు సమాచారం రావడంతో ఆత్మకూరు, నందికొట్కూరు పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.

దొంగల ముఠా సంచరించే పట్టణాలను గుర్తించి అందులోని ఆళ్లగడ్డకు చెందిన చిన్న సవారిని అదుపులోకి తీసుకుని విచారణ చేశామన్నారు. తనతోపాటు మరో ఐదుగురు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చిన్న సవారి వెల్లడించాడని, వివిధ ప్రాంతాల్లో అతను దొంగలించిన 20 కిలోల వెండి,70 గ్రాముల బం గారం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇతని ముఠా గుంటూరు, నెల్లూరు, కర్నూలు ప్రాంతాల్లోని దేవాలయాలు, దుకాణాల్లో చోరీలకు పాల్పడేదని చెప్పారు. త్వరలోనే ఈ ముఠా సభ్యులనూ అరెస్ట్ చేస్తామన్నారు. సమావేశంలో ఆత్మకూరు సీఐ రవిబాబు, నెల్లూరు సీసీఎస్ సీఐ జాన్, నందికొట్కూరు సీఐ కేఎన్ మూర్తి, మిడ్తూరు ఎస్‌ఐ ఆచారి, సీసీఎస్ ఎస్‌ఐ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement