ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Published Thu, Mar 1 2018 9:29 AM

Inter student suicide attempt - Sakshi

మద్దిలపాలెం(విశాఖ తూర్పు): హాజరు తగ్గిన కారణంగా పరీక్ష రాయనివ్వకపోవడంతో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థి నాగ ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలివి.. డాక్టర్‌ వి.ఎస్‌.కృష్ణా జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు హాజరు 60శాతం లేకపోవడంతో పరీక్షకు అనుమతించలేదు. దీంతో సుమారు 40మంది విద్యార్థులు విషయాన్ని ఆర్‌ఐవో దృష్టికి తీసుకువెళ్లేందుకు ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కార్యాలయానికి వెళ్లారు. ఆర్‌ఐవో సమయానికి అక్కడ లేకపోవడంతో కార్యాలయం ముందే బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. మధ్యాహ్నం 12గంటల వరకు ఆర్‌ఐవో కార్యాలయం వద్దే ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనంతరం ఎంవీపీ కాలనీలోని రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లారు. తమను పరీక్షకు అనుమతించాలని వారు కోరారు.

మంత్రి పీఏ శర్మ ఆర్‌ఐవో నగేష్‌కుమార్‌కు ఫోన్‌లో విషయం తెలియజేసి ఆర్‌ఐవో వద్దకు వెళ్లమంటూ వారిని పంపించారు. మళ్లీ ఆర్‌ఐవో వద్దకు వచ్చిన విద్యార్థులు రాగా సైన్స్‌ విద్యార్థులకు 60శాతం కంటే హాజరు తక్కువ ఉంటే పరీక్షకు అనుమతించవద్దని విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాలున్నాయన్నారు. తమకు నిర్ణయం తీసుకునే అధికారం లేదని చె ప్పడంతో విద్యార్థులు విలపించారు. వారితో పాటు  తల్లి దండ్రులు కూడా విలపించడంతో అ క్కడే ఉన్న నాగ రా జు మనస్తాపంతో బ్లేడుతో ఎడమ చేతిపై కోసుకున్నాడు. దీంతో అక్కడే ఉన్న మిగిలిన విద్యార్థులు అడ్డుకో వడంతో ప్రమా దం తప్పింది. పరీక్ష ఫీజు కట్టిం చుకున్న సమయంలో కూడా తమకు విషయం చెప్పలేదని, పరీక్షల సమయంలో హాల్‌టికెట్‌ ఇవ్వననడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్స రం, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సుమారు 30 మంది వరకు హాల్‌ టిక్కెట్‌ ఇవ్వలేదని, తాము మళ్లీ ఇంటర్‌ పరీక్షలకు ప్రైవేటుగా కట్టుకోవల్సిన పరిస్థితి నెలకుంటోందన్నారు. ఈ విషయమై వి.ఎస్‌. కృష్ణాకాలేజీ ప్రిన్సిపాల్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. డాబాగార్డెన్స్‌ ప్రభు త్వ మహిళా జూనియర్‌ కాలేజీలో సుమారు 20 మందిని, భీమిలి ప్రభు త్వ కళాశాలలో 15 మంది విద్యార్థులను పరీక్షకు అనుమతించలేదు.

పిల్లలు కాలేజీకి రాలేదని చెప్పలేదు
మా అబ్బాయి డి.నిఖిల్‌ ఎంపీసీ ఫస్ట్‌ ఇయర్‌ వి.ఎస్‌.కృష్ణా కాలేజీలో చదువుతున్నాడు. పరీక్ష సమయం వచ్చే సరికి హాజరు లేదని పరీక్షకు పంపించడం లేదు. కనీసం ఈ విషయాన్ని తల్లిదండ్రులైన మాకు కాలేజీ నుంచి సమాచారం కూడా ఇవ్వలేదు. ముందుగా తెలిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే మా పిల్లలకు అన్యాయం జరిగింది. –డి. లక్ష్మీప్రసన్న, విద్యార్థి తల్లి

ఒక్కసారీ తల్లిదండ్రుల సమావేశం పెట్టలేదు
మా అబ్బాయికి హాల్‌టికెట్‌ ఇవ్వలేదని కాలేజీకి వస్తే అప్పడు చెబుతున్నారు హాజరు సరిపోలేదని. ఇదే విషయాన్ని తల్లిదండ్రుల సమావేశం పెట్టి చెబితే ఈ పరిస్థితి ఎదరయ్యేదికాదు. ప్రభుత్వ కాలేజీ అనే నిర్లక్ష్యంతో నిబంధనలు పాటించలేదు. ఇప్పడు మా అబ్బాయికి హాజరు లేదు అనేది మాత్రం పక్కాగా పాటిస్తున్నారు. – ఎం.గంగాప్రసాద్, విద్యార్థి తండ్రి, ఆరిలోవ

Advertisement
Advertisement