ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Published Wed, Nov 27 2013 2:02 AM

Inter student suicide in Guntur

సత్తెనపల్లిరూరల్,న్యూస్‌లైన్ : ఇంటర్మీడియట్ విద్యార్థిని పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మంగళవారం సత్తెనపల్లి మండలం దీపాలదిన్నెపాలెం గ్రామంలోజరిగింది. సేకరించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని సత్తెనపల్లిలోని ఓ ప్రవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యార్థిని పురుగుమందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం సత్తెనపల్లిలోని ప్రవేటు వైద్యశాలకు తరలించారు. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యాయత్నానికి కారణమని, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగైందని గ్రామస్తులు తెలిపారు.
 

Advertisement
Advertisement