జన్మభూమితో ప్రజల్లో చైతన్యం | Sakshi
Sakshi News home page

జన్మభూమితో ప్రజల్లో చైతన్యం

Published Sun, Oct 5 2014 3:18 AM

జన్మభూమితో ప్రజల్లో చైతన్యం

qస్వచ్చ భారత్ కార్యక్రమంలో అందరూ భాగ స్వామ్యం కావాలని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని చూచించారు. గ్రామాల్లో మురుగులేకుండా సైడుకాలువలు ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకోవాలని, గ్రామం చివరన చెత్త డంప్పింగ్ యార్డును ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. పింఛన్లను రూ.200 నుంచి రూ.1000కు ప్రభుత్వం పెంచిందని అవి అర్హులైన వారికి అందేలా చూడాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన పశువైద్యశిరాన్ని తనిఖీ చేసి పశువులకు టీకాలు వేశారు.

 జన్మభూమికి నిధులు ఇవ్వండి: కాకాణి
 జన్మభూమి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కాకుటూరు సభలో ఆయన మాట్లాడారు. జన్మభూమి కార్యక్రమాల్లో చేపట్టే పనులకు నిర్మాణంతోపాటు నిర్వహణ అవసరమని, నిధులు కేటాయించాలని తెలిపారు. మొక్కుబడిగా కాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని, పింఛన్ల విషయంలో అర్హులందరికీ న్యాయం చేయాలన్నారు. ప్రజలు రూ.200 నుంచిరూ. 1000 వస్తుందని ఆనందంగా ఉన్నారని ఏదోఒక కారణంపెట్టి తొలగించకుండా  ్లకలెక్టర్ , ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. సర్వేపల్లి నియోజక వర్గ ప్రజలు తమ విజయానికి సహకరించారని వారి అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తానని, అందుబాటులో వారికి తోడుగా ఉంటానని తెలిపారు. ప్రజల పక్షాన పోరాటాలు చేైసైనా మంచి పాలన అందజేస్తానని తెలిపారు.  జెడ్పీటీసీ సభ్యుడు  మందల వెంకటశేషయ్య, ఎంపీపీ తలపల అరుణ, సర్పంచ్ డబ్బుగుంట అమరావతి, ప్రత్యేకాధికారి చంద్రమౌళి, తహశీల్దార్ సుధాకర్, ఎంపీడీఓ సుగుణమ్మ  పాల్గొన్నారు.



 

Advertisement

తప్పక చదవండి

Advertisement