అస్తవ్యస్తంగా విద్యుత్ సరఫరా | Sakshi
Sakshi News home page

అస్తవ్యస్తంగా విద్యుత్ సరఫరా

Published Thu, Feb 27 2014 12:16 AM

Irregular power supply in district

 శంషాబాద్ రూరల్, న్యూస్‌లైన్: విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారిందని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి బి.జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. మండలంలోని పెద్దతూప్ర, రషీద్‌తండా, కేకేబస్తీలో బుధవారం గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఇంటింటికీ తిరుగుతూ పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వ్యవసాయరంగానికి సంబంధించి ఇష్టానుసారంగా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్ హయాంలో వ్యవసాయానికి ఏడు గంటలు నిరంతర విద్యుత్ సరఫరా చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధిస్తుంద న్నారు. రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాకుండా అమ్మ ఒడి పథ కం పెట్టనున్నట్లు వైఎస్.జగన్ ప్రకటించారని గుర్తు చేశారు.

 కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కుమార్‌గౌడ్, కార్యదర్శి నజీర్‌ఖాన్, నాయకులు అక్రమ్‌ఖాన్, యువజన విభాగం మండల అధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, నాయకులు కృష్ణగౌడ్, శ్రీధర్, జానీబాయి, సులేమాన్, కుమార్, మహిపాల్‌రెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్, కృష్ణ, రవీందర్‌గౌడ్, యాదగిరిగౌడ్, శంకర్, గ్రామ నాయకులు పాపిరెడ్డి, శంకర్, జంగయ్య, దేవి, సుశీల, గోవింద్, ప్రవీణ్, నందు, శ్రీనివాస్‌రెడ్డి, శేఖర్, గణేష్‌గౌడ్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement