ఇస్రో చైర్మన్‌ ప్రత్యేక పూజలు

28 Mar, 2018 15:40 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : జీఎస్‌ఎల్‌వీ -ఎఫ్‌8 రాకెట్‌ ప్రయోగం విజవంతం కావాలని కోరుతూ ఇస్రో చైర్మన్‌ డా.శివన్‌ బుధవారం చెంగాల పరమేశ్వరీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగం కోసం 27 గంటల పాటు  కౌంట్‌డౌన్‌ చేపట్టిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి 4 గంటల 56 నిమిషాలకు జీఎల్‌ఎస్‌వీ-ఎఫ్‌8 రాకెట్‌  నింగిలోకి ఎగరనుంది.

ఈ ప్రయోగ సన్నాహాల్లో భాగంగా శాస్రవేత్తలతో డా. శివన్‌ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాది చివర్లో చంద్రయాన్‌-2 ప్రయోగం చేయాబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే నెలలో పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను ప్రయోగంచనున్నట్లు తెలిపారు. కాగా ఇస్రో చైర్మన్‌గా జనవరిలో బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ కె. శివన్‌కు ఇది తొలి ప్రయోగం.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు