జననేత దీక్షకు వెల్లువెత్తిన సంఘీభావం | Sakshi
Sakshi News home page

జననేత దీక్షకు వెల్లువెత్తిన సంఘీభావం

Published Wed, Aug 28 2013 3:55 AM

Jagan flooded solidarity strike in gutur

నిజమైన నాయకుడు ఎప్పుడూ ప్రజా క్షేమమే కాంక్షిస్తాడు. వారి ఇబ్బందులను తనవిగా భావించి, స్పందిస్తాడు. ఎక్కడ ఉన్నా తన ఆలోచనలన్నీ ప్రజల చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి. అలాంటి లక్షణాలను తండ్రి నుంచి వారసత్వంగా పుణికిపుచ్చుకుని, జైల్లో ఉండి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన జననేతకు జనం జేజేలు పలుకుతున్నారు. సమన్యాయం కోరుతూ వైఎస్ జగన్‌మోహన్ దీక్షకు దిగడం చరిత్రాత్మకమని జిల్లా ప్రజలు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.  స్వచ్ఛందంగా వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రహదారుల దిగ్బంధం విజయవంతమైంది.
 
 గుంటూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ సమన్యాయం కోరుతూ జననేత చేపట్టిన దీక్షకు సంఘీభావం వెల్లువెత్తుతోంది. రాష్ర్ట విభజనపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి నిరసనగా చంచల్‌గూడ జైలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మంగళవారానికి మూడో రోజుకు చేరుకుంది. ఆయనకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ఆమరణ నిరాహార దీక్షలు, జలదీక్షలు, రిలే నిరాహారదీక్షలు, మానవహారాలు, రాస్తారోకోలు చేపట్టారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధించారు. గుంటూరు, పొన్నూరు, తెనాలిల్లో ఆమరణ నిరాహారదీక్షలు నిర్వహించగా పలు చోట్ల రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. 
 
 తాడేపల్లి సమీపంలోని సీతానగరం వద్ద కృష్ణానదిలో పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు జలదీక్ష చేపట్టారు. జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ నేతృత్వంలో చిలకలూరిపేటలో రహదారి దిగ్బంధించగా, నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో అంకిరెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మిర్చియార్డు వద్ద వంటావార్పూ చేశారు. తూర్పు నియోజకవర్గ సమన్వయ కర్తలు షేక్ షౌకత్, న సీర్‌అహ్మద్, కావటి మనోహర్, ఆతుకూరి ఆంజనేయులు, బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 గుంటూరు హిందూ కళాశాల వద్ద ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న యండ్రాకోట హరికృష్ణ, తమనం రాజేంద్ర, పి.చైతన్యలను పలువురు నగర కమిటీ నాయకులు పరామర్శించారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. తెనాలిలో పార్టీ నాయకుడు గళ్ళా చందు చేపట్టిన నిరవధిక  దీక్షకు మద్దతుగా పార్టీ జిల్లా రైతు విభాగం కన్వీనర్ మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి, షేక్ మౌలాలి, వైఎస్సార్ స్మారక కళాపరిషత్ కార్యదర్శి పి.విజయలక్ష్మి, ఎస్.రఘురామిరెడ్డిలు రిలే దీక్ష చేశారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మేరుగ నాగార్జున, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ అన్నాబత్తుని సదాశివరావు, జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ షేక్ జాన్‌బాషా, రాష్ట్ర బీసీ సెల్ సభ్యుడు పిడపర్తి క్రిష్టోఫర్‌లు పాల్గొన్నారు. వడ్లమూడి వద్ద ఎంపీటీసీ మాజీ సభ్యుడు అద్దంకి సుబ్రమణ్యం, ఏడుకొండలు, టి.మస్తాన్ చేపట్టిన ఆమరణ దీక్ష కొనసాగుతోంది. పొన్నూరు సమన్వయకర్త రావి వెంకటరమణ ఆధ్వర్యంలో మందపాటి పద్మావతి మంగళవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పార్టీ నాయుకులు మారుపూడి లీలాధర్ అమరజీవి విగ్ర హం వ ద్ద ఆమరణ దీక్ష చేపట్టారు.
 
 బాపట్లలో అర్థనగ్నంగా ఆందోళన.. జిల్లాలో పార్టీ నేతల నిరసన కార్యక్రమాలకు ప్రజా సంఘాలు ప్రజలు మద్దతు ప్రకటించారు. చిలకలూరిపేటలో పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించారు. యడ్లపాడు, సాతులూరి, బొపూడి, కట్టుబడివారిపాలెం గ్రామాల వద్ద రాస్తారోకోలు, రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. గురజాల నియోజకవర్గంలో సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అద్దంకి-నార్కెట్‌పల్లి స్టేట్ హైవేలో రాస్తారోకో నిర్వహించారు. దాచేపల్లి నుంచి మొదలుకొని తెలంగాణ సరిహద్దు ప్రాంతం పొందుగల వరకు హైవేను దిగ్బంధించారు. ప్రత్తిపాడులో మండల పార్టీ కన్వీనర్ చాగంటి ఉమామహేశ్వరరావు, మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ జిలానీల ఆధ్వర్యంలో గుంటూరు పర్చూరు పాతమద్రాసు రోడ్డుపై బైఠాయించారు. 
 
 పత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, గుంటూరురూరల్ మండలాల పార్టీ నాయకులు సాంబయ్యచౌదరి, కె.సంజీవరెడ్డి, వి.నారాయణ, చినకోండ్రుపాడు సొసైటీ అధ్యక్షుడు కట్టా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సత్తెనపల్లిలో పార్టీ మైనార్టీ విభాగం జిల్లా కన్వీనర్ సయ్యద్ మహబూబ్, పట్టణ పార్టీ కన్వీనర్ గార్లపాటి ప్రభాకర్, సత్తెనపల్లి మండల కన్వీనర్ మదమంచి రాంబాబు రాస్తారోకో చేశారు. ముప్పాళ్ళలో పార్టీ మండల కన్వీనర్ రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి నిరసనలో పాల్గొన్నారు. సత్తెనపల్లిలో జరుగుతున్న రిలే  దీక్షలో ముప్పాళ్ళ మండల పార్టీ నాయకులు కూర్చుకున్నారు. బాపట్ల నియోజకవర్గంలో సమన్వయకర్త కోన రఘుపతి నాయకత్వంలో పట్టణ కన్వీనర్ దుగ్గమల్లి ధర్మారావు ఆధ్వర్యంలో జాతీయరహదారి దిగ్బంధించారు. అర్ధనగ్నంగా ఆందోళన చేపట్టారు. ఎస్సీ సెల్ కన్వీనర్ ఇనగలూరి మాల్యాద్రి, కొండారెడ్డి అనిల్‌కుమార్, కూనపురెడ్డి ఆవినాష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
 
 తాడికొండ నియోజకవర్గం తుళ్లూరులో కొమ్మినేని కృష్ణారావు ఆధ్వర్యంలో, ఫిరంగిపురంలో మండల కన్వీనర్ కొల్లి శివారెడ్డి ఆధ్వర్యంలో నిరాహారదీక్షలు నిర్వహించారు. నరసరావుపేటలోని వైఎస్సార్ సెంటర్ వద్ద సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. అనంతరం పెట్లూరివారిపాలెంలో వినుకొండరోడ్డులో, జొన్నలగడ్డ వద్ద గుంటూరు రోడ్డులో, అల్లూరివారిపాలెం రోడ్డులో, రావిపాడు వద్ద మాచర్ల రోడ్డులో, రొంపిచర్ల వద్ద అద్దంకి-నార్కెట్‌పల్లి రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంలో మూడో రోజు రిలే దీక్షలు కొనసాగాయి. 
 
 పెదకూరపాడు నియోజకవర్గంలో సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో క్రోసూరులో లేళ్ళ హరి, దేసిరెడ్డి సత్యనారాయణ, షేక్ ఖాదర్ ఆధ్వర్యంలో రిలేనిరాహారదీక్ష చేపట్టారు. వినుకొండలో నన్నపనేని సుధ ఆధ్వర్యంలో జరిగిన రాస్తారోకోలో డాక్టరు లతీఫ్‌రెడ్డి, టి.వెంకటరెడ్డి, పుష్పరాజ్, ముర ళి పాల్గొన్నారు. మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీఆర్కే సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. స్థానిక సెయింట్ ఆన్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధనలు నిర్వహించారు. వేమూరులో మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పార్టీ మహిళా కన్వీనర్ దాది వెంకటలక్ష్మీరాజ్యం, భట్టిప్రోలు మండల కన్వీనర్ పి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రాస్తారోకోలు జరిగాయి. 
 

Advertisement
Advertisement