హైదరాబాద్ను యూటీ చేయొద్దు, సోనియాకు జైపాల్ విజ్ఞప్తి | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ను యూటీ చేయొద్దు, సోనియాకు జైపాల్ విజ్ఞప్తి

Published Mon, Nov 25 2013 12:14 PM

హైదరాబాద్ను యూటీ చేయొద్దు, సోనియాకు జైపాల్ విజ్ఞప్తి - Sakshi

న్యూఢిల్లీ : కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ అంశంపై చర్చించనట్లు సమాచారం. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోగా విభజన ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని జైపాల్ రెడ్డి ....సోనియాకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయరాదని, ఎలాంటి ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలని ఆయన అధినేత్రిని కోరినట్లు సమాచారం. అలాగే భద్రాచలాన్ని తెలంగాణలోనే ఉంచాలనే ప్రతిపాదనతో పాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తుంది. కాగా జీవోఎం సిఫార్సులు ఖరారు అవుతున్న నేపథ్యంలో జైపాల్ రెడ్డి.... సోనియాతో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement
Advertisement