ప్రభుత్వ పాలనా సంస్కరణలకు రిఫ్‌మాన్‌ ప్రశంసలు

17 Oct, 2019 05:21 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తోనూ భేటీ

సాక్షి, అమరావతి:  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పాలనా సంస్కరణలపై హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రిఫ్‌మాన్‌ ప్రశంసలు కురిపించారు. కాన్సులేట్‌ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆయన బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయాలతో పాటు, పరిపాలనలో తీసుకొస్తున్న సంస్కరణలను ముఖ్యమంత్రి వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న పలు కార్యక్రమాలను తెలియజేశారు. అవినీతి రహిత, పారదర్శక, సుపరిపాలనలో భాగంగా తీసుకొచ్చిన విధానాల గురించి రిఫ్‌మాన్‌కు వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, ఆమేరకు తగిన కృషి చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తిచేశారు.

గవర్నర్‌తోనూ భేటీ..
అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రిఫ్‌మాన్‌ బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అమెరికా తోడ్పాటు అందించాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తోడ్పాటు అందించాలన్నారు. దీనిపై రిఫ్‌మాన్‌ సానుకూలంగా స్పందిస్తూ విశాఖపట్నం స్మార్ట్‌సిటీ అభివృద్ధి ప్రాజెక్టుకు తాము సహకారం అందిస్తున్నామని చెప్పారు. తాను మంగళవారం విశాఖపట్నంలో పర్యటించి ఆ ప్రాజెక్టు పనులను పరిశీలించానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ ముఖ్య కార్యదర్శి ముఖేష్‌ కుమార్‌ మీనా, సంయుక్త కార్యదర్శి అర్జునరావుతోపాటు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ సభ్యులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మరో మొగ్గ రాలిపోయింది.. 

సంక్షేమ జాతర

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీఏనంటూ..

చెప్పినట్లు వినకపోతే నీ అంతుచూస్తా !

ఇక్కడి మట్టిలో కలిసిపోవాలని ..

ఆనందోత్సాహాల కల‘నేత’

టమాటాతో ఊజీ రోగాలు

యువత భవితకు భరోసా

'మానిటరింగ్‌ వ్యవస్థ బలోపేతం చేస్తాం'

కడలి కెరటమంత కేరింత

రూ.450 కోట్ల నకిలీ ఇన్‌వాయిస్‌లు!

‘ఆంధ్రజ్యోతి’కి స్థల కేటాయింపులు రద్దు

డీఎస్సీలో బోగస్‌ బాగోతం ! 

మన అరటి.. ఎంతో మేటి!

‘వెదురు’ లేని అక్రమాలు 

పెళ్లి దుస్తులు తీసుకెళ్తుండగా...

నేడే ‘నవోదయం’

కల్కి ఆశ్రమాల్లో ఐటీ దాడులు

సంక్షేమ జల్లు

రాజధానిపై నివేదిక సిద్ధం

‘చిత్తూరు’లో భారీ ఫుట్‌వేర్‌ సెజ్‌!

చింతమనేనిని వదలని కోర్టు కేసులు

ఈనాటి ముఖ్యాంశాలు

టీడీపీ పొలిట్‌బ్యూరోలోకి కొత్త ముఖాలు

కచ్చులూరు బోటు వెలికితీత అప్‌డేట్‌

ఏపీ టిడ్కో ప్రాజెక్టుల్లో రివర్స్‌ టెండరింగ్‌

వర్ల రామయ్య విజ్ఞతకే వదిలేస్తున్నాం...

సీఎంను కలిసిన అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌

‘చంద్రబాబు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: ‘పాత అలీ కావాలి!’

విక్రమ్‌తో కేజీఎఫ్‌ హీరోయిన్‌?

ఆయన మాత్రమే బాకీ..

బాలు పాట హైలైట్‌

గ్యాంగ్‌స్టర్‌ గంగూభాయ్‌

మలుపుల సరోవరం