అడ్వొ'కేట్లు' | Sakshi
Sakshi News home page

అడ్వొ'కేట్లు'

Published Tue, Jul 21 2015 10:24 AM

judje ordered enquery on advocates forgery for widow property case

  •   ఫోర్జరీతో ఆస్తిని కాజేశారు
  •   ముగ్గురు లాయర్లపై క్రిమినల్ కేసులు
  •   ఆగస్టు 20లోపు కేసు దర్యాప్తు చేయాలి
  •   మహిళ ఫిర్యాదుపై స్పందించిన న్యాయస్థానం
  • చిత్తూరు(పుంగనూరు) :
     ఓ వితంతు మహిళకు చెందిన అసైన్‌మెంట్ భూమిని ఆమెకు తెలియకుండా న్యాయవాదులు కొందరు కుట్రపన్ని ఫోర్జరీ సంతకాలతో సొంతం చేసుకున్నారు. బాధిత మహి ళ ఫిర్యాదుతో బాధ్యులైన ముగ్గురు న్యాయవాదులతోపాటు మరో ఐదుగురిపై ఫోర్జరీ, మోసం, న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడం వంటి కేసులు నమోదు చేయాల ని పుంగనూరు కోర్టు సోమవారం ఎస్‌ఐ హరిప్రసాద్‌ను ఆదేశించింది. బాధిత మహిళ మల్లెల కన్నెమ్మ తరపున న్యా యవాది హితేంద్రరెడ్డి తెలిపిన వివరాలిలా...


      పెద్దపంజాణి మండలం చిన్నారి కుంట నివాసి కన్నెమ్మకు సోమల మండలం అన్నెమ్మగారిపల్లెలో సుమారు 11 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని కా జేసేందుకు మల్లెల చిన్నవెంకటేశు, మల్లెల చిన్నమణిప్రయత్నించగా 1992 లో పుంగనూరు కోర్టులో కేసు దాఖలు చేశారు. కోర్టు కన్నెమ్మకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై మల్లెల చిన్న య్య తదితరులు సీనియర్ సివిల్‌జడ్జి కోర్టులో అపీల్ వేయగా అక్కడ కూడా అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై హైకోర్టులో అపీలు వేయగా పెండింగ్ లో ఉంది. ఇదిలా ఉండగా 2014లో కన్నెమ్మకు తెలియకుండా ప్రత్యర్థులు వెంకటేశు, చిన్నమణి, వేణుగోపాల్‌రెడ్డి, ఈశ్వరయ్య, సుబ్రమణ్యం నాయుడు న్యాయవాదులైన సివి.శ్రీనివాసులు, వి.సూర్యనారాయణరావు, అరవిందకుమార్‌తో కలిసి కుట్రపన్ని ఆమె సంతకాలను ఫోర్జరీ చేశారు. ఈ కేసుకు సంబంధించి రాజీ కోసం లోక్ అదాలత్‌కు పె ట్టుకున్నారు. ఆమె స్థానంలో వేరొకరిని హాజరుపరిచి లోక్ అదాలత్‌ను తప్పుదోవ పట్టించారు. అనంతరం భూమిని నిందితుల పేరుతో మార్చుకున్నారు. దీనిపై బాధితురాలు కలెక్టర్, ఎస్పీ, జి ల్లా జడ్జికి ఫిర్యాదు చేశారు. ఈనెల 15న పుంగనూరు మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేసినట్లు న్యాయవాది హితేంద్రరెడ్డి తెలిపారు. న్యాయమూర్తి మోతిలాల్ సోమవారం కేసు పూర్వాపరాలను పరిశీలించారు. కేసు దర్యాప్తు చేపట్టాలని పుంగనూరు ఎస్‌ఐ హరిప్రసాద్‌ను ఆదేశించారు. అలాగే ఫోర్జరీ పత్రాలను స్వాధీనం చేసుకుని, సంతకాల నిపుణులకు పంపాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశా రు. న్యాయవాదులపై క్రిమినల్ కేసుల నమోదుకు కోర్టు ఆదేశించడంతో పట్టణంలో సంచలనం రేకె త్తిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement