రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తొలి సీఎంగా, టీడీపీ అధ్యక్షుడు, తన మామ చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనుండటం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని టాలీవుడ్ ప్రముఖ నటుడు జూ.ఎన్టీఆర్ అన్నారు. మామయ్య ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాలని తనకు ఆహ్వానం అందిందని తెలిపారు. ఆదివారం ఉదయం కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని నిమ్మకూరు గ్రామానికి విచ్చేశారు.
ఈ సందర్బంగా నిమ్మకూరు గ్రామంలోని స్వర్గీయ ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి జూ.ఎన్టీఆర్‌తోపాటు సోదరుడు కళ్యాణ్ రామ్ ఘనంగా నివాళులర్పించారు. జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లను కలిసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిమ్మకూరు చేరుకున్నారు. ఈ రోజు రాత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జూ.ఎన్టీఆర్ హాజరుకానున్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి 7.27 గంటలకు గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాంతో స్వర్గీయ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఆహ్వానం అందింది.... వచ్చాను
Published Sun, Jun 8 2014 11:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement