పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోం | Sakshi
Sakshi News home page

పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోం

Published Tue, Oct 7 2014 1:02 AM

పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోం - Sakshi

కార్వేటినగరం: అనర్హులైన పింఛన్‌దారుల ఏరివేత కార్యక్రమంలో అర్హులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధరనెల్లూరు ఎమ్మె ల్యే కే.నారాయణస్వామి స్పష్టం చేశారు. సోమవారం కార్వేటినగరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో గతంలో వస్తున్న పింఛన్లలో సగానికి పైగా కోతలు విధించినట్లు చెప్పారు. సర్వేల పేరుతో పేదలకు టోకరా పెడుతున్నారని ఆరోపించా రు. అధికారులు టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తూ అర్హులకు మొండిచేయి చూపుతున్నారని మండిపడ్డారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మరిపించేందుకు ప్రభుత్వం జన్మభూమిని ఒక సాధనంగా వాడుకుంటోం దని అన్నారు. ఒకే ఇంట్లో అర్హులు ఎంతమంది ఉన్నా పింఛన్లు ఇవ్వాలని కోరారు. పేదలకు అన్యాయం జరిగినట్లు తెలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని వివరిం చారు. భూ సమస్యలపైనా పేదల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, రెవెన్యూ అధికారులు వాటిని పరిష్కరించాలని కోరారు. రుణమాఫీ కోసం ఎదురుచూసిన రైతులు, డ్వాక్రా మహిళలు ప్రభుత్వ తీరుతో తీవ్ర నిరాశకు గురయ్యారని తెలిపారు. వెంటనే రుణమాఫీ అమలు చేయకపోతే ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisement
Advertisement