అవసరమైతే ట్రంప్‌ సహాయం తీసుకుంటా.. కేఏ పాల్‌ | Sakshi
Sakshi News home page

అవసరమైతే ట్రంప్‌ సహాయం తీసుకుంటా.. కేఏ పాల్‌

Published Sat, Dec 29 2018 4:24 PM

KA Paul fires on Chandrababu naidu - Sakshi

సాక్షి, విశాఖపట్నం : శ్రీకాకుళం మత్స్యకారుల కోసం పాక్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో మాట్లాడతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. పాక్‌ అధ్యక్షుడిగా ఇమ్రాన్‌ గెలిచినప్పుడు తాను నార్వే నుంచి ఫోన్‌ చేసి కంగ్రాట్స్‌ చెప్పానని తెలిపారు. తాను నేరుగా పాకిస్తాన్‌ కూడా వెళ్లగలనని, త్వరలోనే శ్రీకాకుళం మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తానన్నారు. 22మంది మత్సకారుల విడుదలకు ఎంతైనా కృషి చేస్తానని, అవసరమైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సహాయం తీసుకుంటానన్నారు.

విశాఖపట్నంలో ప్రజాశాంతి పార్టీ కార్యాలయాన్ని శనివారం ప్రారంభించి మీడియాతో మాట్లాడారు.. 'ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కాబోతోంది. గతంలో తెలంగాణలో టీడీపీ కనుమరుగవుతుందని చెప్పా. మాతో ఎవరు కలిసి వచ్చినా వారితో మేము కలిసి పనిచేస్తాం. వివిధ పార్టీల నాయకులను మేము ఆహ్వానిస్తున్నాం. చంద్రబాబు మహబూబ్ నగర్, ఒంగోలులో నాపై ఉన్న కేసులు మాఫీ చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఇప్పుడు కేసులను మాఫీ కాకు౦డా ఆడుకుంటున్నారు. భీమవరంలో నా సభను చంద్రబాబు నాయుడు కావాలని అడ్డుకున్నారు. చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలన్నీ మోదీ చేస్తారని ఇచ్చాడా? ఏం అడిగినా నరేంద్ర మోదీ ఇవ్వలేదని అంటున్నారు. హామీలు చంద్రబాబు ఇచ్చారా, లేక మోదీ ఇచ్చారా? మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజే 50% రైతుల రుణ మాఫీ చేస్తాం. ఐదేళ్లలో 100% చేస్తాం. 7 లక్ష ఏడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తా.. పరిశ్రమలు తీసుకొస్తా ఉపాధిని ఇస్తా' అని తెలిపారు.

Advertisement
Advertisement