జామర్‌ను ఢీకొట్టిన కాచిగూడ ఎక్స్‌ప్రెస్ | Sakshi
Sakshi News home page

జామర్‌ను ఢీకొట్టిన కాచిగూడ ఎక్స్‌ప్రెస్

Published Thu, May 1 2014 1:10 AM

జామర్‌ను ఢీకొట్టిన కాచిగూడ ఎక్స్‌ప్రెస్

డైవర్‌కు స్వల్ప గాయాలు
 
 హిందూపురం,  . అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ పరిధిలోని గుడ్డం సమీపంలో కాపలా లేని రైల్వే గేటు దగ్గర బుధవారం ఉదయం జామర్ కారును కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది.దాంతో కారు ముందు భాగం ధ్వంసం కాగా, డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హిందూపురం పర్యటన నేపథ్యంలో బందోబస్తు నిమిత్తం డీఎల్-2సీఎం 6650 నంబరు గల రిమోట్ ఆపరేషన్స్‌ను నిర్వీర్యం చేసే జామర్‌కారు తీసుకొచ్చారు. దీన్ని ఎస్పీజీకి చెందిన డ్రైవర్ మానస్‌భగత్ సభా ప్రాంగణం నుంచి రైల్వేట్రాక్ సమీపంలో పరీక్షించేందుకు తీసుకెళ్లారు.

సమీపంలోని కాపలాలేని రైల్వే ట్రాక్‌ని దాటాల్సి ఉంది. అదే సమయానికి కాచిగూడ-యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు వస్తోంది. ఈలోపు పట్టాలు దాటిపోవచ్చని డ్రైవర్.. జామర్ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. అంతలోనే వేగంగా వచ్చిన రైలు కారుని ఢీకొంది. దాంతో కారు పల్టీకొట్టి రైల్వే గేటుకి అమర్చిన ఇనుప స్తంభాలకు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతినగా డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు.

Advertisement
Advertisement