Sakshi News home page

కడపకు చంద్ర గ్రహణం

Published Thu, Aug 7 2014 2:56 AM

Kadapa district has been ignored for decades caused by a grudge

సాక్షి ప్రతినిధి, కడప: రాజకీయ కక్షతో కడప జిల్లా దశాబ్దాల త రబడి నిర్లక్ష్యానికి గురైంది. రాయలసీమ ప్రాంతవాసులే ముఖ్యమంత్రులుగా ఉన్నా అన్ని విధా లా వెనుకబడింది. మూడు దశాబ్దాలుగా వివక్షకు గురైన జిల్లాకు మరోమారు ‘చంద్ర’గ్రహణం పట్టింది. పారిశ్రామిక ప్రగతికి అవసరమైన మౌ లిక సదుపాయాలు అం దుబాటులో ఉన్నా విస్మరిస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే అభివృద్ధి ఫలాలు దక్కుతాయనే కనీస స్పృహ లేకపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ జిల్లాను అప్రాధాన్యత జాబితాలో చేర్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 వెనుకబడిన కడప జిల్లా ‘దశ-దిశ’ 2004-2009 లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మారింది. జిల్లా సమగ్రాభివృద్ధి దిశగా పయనించింది. కేజీ నుంచి పీజీ వరకూ అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులోకి వచ్చింది.
 
  కేంద్రీయ విద్యాలయం, హైదరాబాదు పబ్లిక్ స్కూలు, యోగివేమన యూనివర్సిటీ, జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల, ట్రిపుల్ ఐటీ, రాజీవ్‌గాంధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కళాశాల, దంత వైద్య కళాశాల, పశువైద్య విద్య కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే దాల్మియా, భారతి సిమెంటు కర్మాగారాలు, పాలిమర్స్ పరిశ్రమలు వచ్చి చేరాయి. అదే విధంగా రహదారుల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటివి ప్రత్యేక ప్రాధాన్యతతో చేపట్టారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తయి, అభివృద్ధి ఫలాలు దక్కుతాయనుకున్న తరుణంలో అర్ధంతరంగా ప్రాజెక్టులు ఆగిపోయాయి. స్వల్ప మొత్తం ఖర్చు పెడితే అభివృద్ధి కళ్లెదుట కన్పించనుంది. అలాంటి పథకాలు సైతం దిష్టిబొమ్మలా దర్శనమిస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా కలెక్టరేట్ కాంప్లెక్స్, అంతర్జాతీయ పశుపరిశోనా కేంద్రం నిలుస్తున్నాయి.
 
 మెగా పరిశ్రమల కోసమే..
 ఉపాధి మార్గాలు చూపడం ద్వారా ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్‌ను కూకటి వేళ్లతో పెకలించవచ్చని దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ భావించారు. అందులో భాగంగా కడప సమీపంలో చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వల్లూరు మండలాల పరిధిలోని ప్రభుత్వ, డీకేటీ భూములను ఏపీఐసీసీ ద్వారా సేకరించి పారిశ్రామికవాడ ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఆ మేరకు కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్ పరిధిలో 6464.5 ఎకరాలు భూ సేకరణ చేశారు. అందుకోసం సోమశిల వెనుక జలాల నుంచి నీటి వసతి కల్పనకు శ్రీకారం చుట్టారు. శరవేగంగా రూ.450 కోట్లతో నీటి వసతి ఏర్పాటుకు పనులు చేపట్టారు. అందులో రూ.150 కోట్ల మేర పనులు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో చేసిన పనులకు బిల్లులు అందక కాంట్రాక్టర్లు ఆ పనులు నిలిపేశారు. కొన్ని కంపెనీలు ముందుకు వచ్చినా భరోసా కల్పించేవారు లేక వెనుతిరిగారు. భారత్ డైనమిక్ లిమిటెడ్ కంపెనీ (బీడీఎల్) ఏర్పాటుకు ప్రతినిధుల బృందం కడప మెగా ఇండస్ట్రియల్ పార్కును సందర్శించి అనువైన ప్రదేశంగా గుర్తించారు. ఆ మేరకు 600 ఎకరాలు కేటాయించాలంటూ అభ్యర్థించా రు.  
 
 విమానాల స్పేర్‌పార్ట్స్, రక్షణ విభాగాలు ఉత్పత్తి చేసే ఈ పరిశ్రమ ప్రతి నిధులు ఏపీఐఐసీ ఎండీతో సైతం చర్చించారు. అయితే అప్పటి  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రె డ్డి నుంచి సానుకూలత లేకపోవడంతో వెనుదిరిగారు. కడప లో నెలకొల్పాల్సిన ఆ పరి శ్రమ చిత్తూరు జిల్లా పలమనేరులో ఏర్పాటు చేయాల్సిందిగా ఒత్తిడి చేయడంతో వెనక్కి తగ్గారని సమాచారం. రాష్ట్ర విభజన అనంతరం అన్ని జిల్లాల్లో అటు పారిశ్రామికంగానో, ఇటు వైద్యం, అత్యున్నత విద్య పరంగానో అభివృద్ధికి ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. అలాంటి జాబితాలో వైఎస్సార్ జిల్లాకు మాత్రం చోటు దక్కడం లేదని జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 జిల్లా కలెక్టర్ల సమీక్షలోనైనా గుర్తింపు దక్కేనా...
 గురువారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులతోపాటు, ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్లుతో సమీక్ష నిర్వహించనున్నారు. అందులోనైనా జిల్లాకు ప్రాధాన్యత దక్కుతుందా అని పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైఎస్సా ర్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు, విద్యుత్ జనరేషన్ ప్లాం ట్ల నిర్మాణానికి ఆశావహులు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ ప్రతిపాదనలు తీసుకెళ్లినట్లు సమాచారం. అలాగే తక్కువ ఖర్చుతో పూర్తి కాగల సాగునీటి ప్రాజెక్టుల వివరాలు రూపొందించినట్లు తెలుస్తోంది. తుది దశకు చేరిన విమానాశ్రయం, కలెక్టరేట్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్నాయని వివరించనున్నట్లు తెలిసింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పట్ల ఏమేరకు దయచూపుతారో వేచి చూడాల్సిందే.
 

Advertisement
Advertisement