ఒంగోలు టౌన్: పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మేకల కాపరి అన్యాయంగా మృతి చెందాడు. తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతుని భార్య పోరు బాట పట్టింది. ఈ విషయం అప్పటి కలెక్టర్ దేవానంద్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు అధికారులు ఆమెకు అంగన్వాడీ కార్యకర్త పోస్టు ఇచ్చారు. విధుల్లో చేరిన కొన్నేళ్ల త ర్వాత ఆమెను అకారణంగా తొలగించేశారు. న్యాయం చేయాలంటూ బాధిత మహిళ గురువారం కలెక్టరేట్ వద్ద ‘ఉద్యోగ’ పోరాటానికి దిగింది. కలెక్టరేట్ ముందు బైఠాయించి తనకు జరిగిన అన్యాయంపై విలేకరుల వద్ద భోరున విలపించింది.
ఇదీ.. జరిగింది
1992లో కురిచేడు మండలం ఆవులమంద పంచాయతీలోని రామాంజనేయకాలనీ సమీపంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అక్కడే మేకలు కాసుకుంటున్న నాగార్జున అనే వ్యక్తికి బుల్లెట్లు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి భార్య కళావతి, కుమారుడు ఉన్నాడు. కట్టుకున్న భర్త అకారణంగా మరణించడం, పసి బిడ్డను ఎలా సాకాలో తెలియక కళావతి ఆందోళన చెందింది. తనకు న్యాయం చేయాలని అప్పటి నుంచి అధికారులను వేడుకుంటూనే ఉంది. సంవత్సరాలు గడుస్తున్నా ఆమెకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలో 2009లో అప్పటి కలెక్టర్ దేవానంద్ ఆమెను అంగన్వాడీ కార్యకర్తగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అంగన్వాడీ కార్తకర్తగా కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆమెకు ఆ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్‌గా విద్యావతి ఉన్న సమయంలో కళావతిని గతేడాది అకారణంగా తొలగించారు. ప్రస్తుత కలెక్టర్ విజయకుమార్ మండలాల్లో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌లో భాగంగా తర్లుపాడు వచ్చి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆ సమయంలో కళావతి తనకు జరిగిన అన్యాయం గురించి ఆయన వద్ద ఏకరువు పెట్టింది.
తన పోస్టుకు మరొకరు 50 వేల రూపాయలు ఇస్తానని ఆశ చూపడంతో తనను విధుల నుంచి తొలగించారని కళావతి వాపోయింది. తనకు న్యాయం చేయాలని వేడుకొంది. కురిచేడు నుంచి ఒంగోలు వచ్చినా ఇక్కడ అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో సాయంత్రం వరకు ఆమె ఉండి ఉసూరుమంటూ వెనుదిరిగింది. ఆమెకు అధికారులు ఏం న్యాయం చే స్తారో చూడాలి.
ఉద్యోగం కోసం..
Published Fri, Dec 19 2014 3:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
బాంబీ బకెట్ అంటే ఏమిటి? కార్చిచ్చును ఎలా నియంత్రిస్తుంది?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- ఈసారి ఓటు మార్పు కోసమే
- మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే
- కృష్ణమ్మ తీరం విజయహారం
- వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
- గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
- పెళ్లెప్పుడు అని ప్రశ్న.. హీరోయిన్ మాళవిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
- శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
- Doctor Family Suicide: నేను లేక.. మీరుండలేరు..!
- వంట సరిగా చేయలేదని.. భార్యను చంపిన భర్త
Advertisement