కన్నడంలో కేక పెట్టించిన తెలుగు కుర్రాడు | Sakshi
Sakshi News home page

కన్నడంలో కేక పెట్టించిన తెలుగు కుర్రాడు

Published Fri, Jan 9 2015 4:43 AM

కన్నడంలో కేక పెట్టించిన తెలుగు కుర్రాడు - Sakshi

ఒక పరిశ్రమ నుంచి హిట్టైన సినిమాలు మరో పరిశ్రమకు వెళ్లటం సహజం. అయితే ఆర్టిస్టులు మాత్రం సాధారణంగా ఒక ప్రాంతానికే పరిమితమవుతూంటారు. హీరోలు అయినా రెండు,మూడు లాంగ్వైజ్ లలో ప్లాన్ చేసుకోవటమో లేక వేరే చోట అవకాసమొస్తే అక్కడకి వెళ్లి నటించటమో చేస్తూంటారు. క్యారెక్టర్ ఆర్టిస్టులకు మాత్రం అలాంటి ఆఫర్స్ అరుదుగా వస్తాయి.

వచ్చినా ప్రూవ్ చేసుకునే వాళ్లు చాలా తక్కువ. తెలుగులో జోష్ రవిగా పేరు తెచ్చుకున్న యువ కమిడియన్ గా దూసుకు వెళ్తున్న రవికి అలాంటి అవకాసం వచ్చింది.  తెలుగులో హిట్టైన గుండెజారి గల్లంతైంది చిత్రాన్ని  ఖుషి ఖుషియాగి టైటిల్ తో  కన్నడంలో రీమేక్ అయ్యింది. తెలుగు గే క్యారెక్టర్....చేసిన జోష్ రవికి ఇక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో కన్నడ వెర్షన్ కు సైతం అతన్నే ఆ పాత్రకు తీసుకున్నారు. అక్కడ సైతం రవికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

తెలుగులో మెప్పించిన రవి, కన్నడంలోనూ అదే క్యారెక్టర్  చేసి కన్నడ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాడు. థియోటర్ లో రవి పాత్రకు మంచి రెస్పాన్స్ రావటంతో అక్కడ నుంచి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. కన్నడంలో కేక పెట్టించిన మన కుర్రాడు జోషి రవి మాట్లాడుతూ.... గణేష్ లాంటి పెద్ద హీరోతో తొలి చిత్రం చేయటం తన అదృష్టమని చెప్పారు. అలాగే కన్నడ పరిశ్రమలో మంచి టెక్నీషియన్స్ ఉన్నారని, క్రమశిక్షణతో సాగే పరిశ్రమ అన్నారు. తన పాత్రను రిసీవ్ చేసుకుంటున్న కన్నడ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement