తుపాను సాయం స్వాహా | Sakshi
Sakshi News home page

తుపాను సాయం స్వాహా

Published Sat, Nov 1 2014 5:13 AM

తుపాను సాయం స్వాహా - Sakshi

విశాఖ :  హుదూద్ సహాయంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిత్యావసర వస్తువులను టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వాహా చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ విమర్శించారు. ఆయన శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గాజువాక, భీమిలి ప్రాంతాల్లో నిత్యావసర సరుకులతో పట్టుబడ్డ టీడీపీ నాయకులే దోపిడీకి నిదర్శనమన్నారు. టీడీపీ కార్యకర్తలు సంతకాలు పెట్టి రేషన్ సరుకులను కొల్లగొడుతున్నారని ఆయన ఆరోపించారు.

 

జిల్లా మంత్రుల నియోజకవర్గాల్లో సైతం అవకతవకలు జరిగాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడే మకాం వేసి హడవుడి చేస్తూ నటించారన్నారు. ఏజేన్సీలో ఇప్పటికి ఎలాంటి సాయం అందలేదని బాబుకు తెలీదా అని ప్రశ్నించారు. జిల్లాలో లక్ష ఇళ్లకు పైగా దెబ్బతిన్నాయి. కూలినప్రతీ ఇంటిని పక్క నిర్మాణం చేయాలి. చినగదిలి దేవస్థానం భూముల్లోని పడి పోయిన ఇళ్లను నిర్మించాలి. హుదూద్ తుఫాన్ బాధితులకు వస్తున్న విరాళాలు ముఖ్యమంత్రి రిలీప్ ఫండ్‌లో జమ చేయకూడదు.

ప్రత్యేక బ్యాంక్ ఖాతా తెరిచి దాతల విరాళాలను జమ చేసి జిల్లాకే వినియోగించాలని అమర్‌నాధ్ డిమాండ్ చేశారు. తుఫాన్ పనుల్లో టీడీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ వైఖరకి నిరసనగా నవంబరు 5న ధర్నా నిర్వహించానున్నామని చెప్పారు. ఎమ్మేల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ పెను తుఫాన్‌తో ఏజెన్సీ అతాలకుతలమైందన్నారు. పది పదిహేనేళ్లు కష్టపడితే వచ్చే కాఫీ పంటలు నాశనమైందన్నారు. చంద్రబాబు నాయుడు ఏజెన్సీలో కంటితుడుపు పర్యటన చేశారన్నారు.

హెక్టార్ కాఫీ పంటలపై ఏడాదికి రూ.లక్ష సంపాదించే గిరిజన రైతులను రూ.25వేలు సహాయం చేయానున్నట్టు జీవో విడుదల చేయడం బాధాకరమన్నారు. గిరిజనులకు  కనీసం 35 కేజీల బియ్యం అందివ్వాలని వినతి పత్రం అందిస్తే సీఎం కసురుకుని అవమానించారన్నారని ఆవేదన చెందారు.  వైఎస్సార్‌సీపీ గెలిచిన గిరిజన ప్రాంతాలను చిన్న చూపుచూస్తున్నారని ఆరోపించారు.  హుదూద్ వచ్చి పందొమ్మిది రోజులైనా టీడీపీ ప్రభుత్వం సర్వేలతో కాలయాపన చేస్తున్నారని ద్వజమెత్తారు. బియ్యం, కాయగూరలు తప్ప ఆర్ధిక సహయం అందివ్వలేదని మండిపడ్డారు.  

తమ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ప్రజలకు మద్దతుగా ప్రభుత్వంపై పోరాటం చేయానున్నామన్నారు. 5వ తేదీన జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో రాష్ట కార్యదర్శులు వంశీకృష్ణశ్రీనివాస్, కంపా హనోకు, సమన్వయకర్తలు కర్రి సీతారం, మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, పెట్ల ఉమాశంకరగణేష్, రొంగలి జగన్నాథం, ప్రగడ నాగేశ్వరరావు, చొక్కాకుల వెంకటరావు, తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.హెచ్.ఫరూఖి, నాయకులు భూపతిరాజు శ్రీనివాస్, రవిరెడ్డి, పక్కి దివాకర్, గుడ్ల పోలిరెడ్డి, పసుపులేటి ఉషాకిరణ్, జాన్ వెస్లీ, విల్లూరి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement