నిరాయుధుల్ని పొట్టనబెట్టుకున్నారు | Sakshi
Sakshi News home page

నిరాయుధుల్ని పొట్టనబెట్టుకున్నారు

Published Sun, Dec 4 2016 3:21 AM

నిరాయుధుల్ని పొట్టనబెట్టుకున్నారు - Sakshi

- మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్ మృతుల కుటుంబీకుల ఆవేదన
- యూనివర్సిటీల విద్యార్థుల నిజనిర్ధారణ నివేదిక ఆవిష్కరణ
 
 సాక్షి, హైదరాబాద్: వారిలో కొందరు బిడ్డల్ని కోల్పోయిన తల్లులు.. ఇంకొందరు భర్తల్ని కోల్పోయిన భార్యలు.. చెల్లెళ్లను కోల్పోయిన అక్కలు.. మరికొందరు ఏనాడో ఇల్లు వదిలి పోయాడనుకున్న కొడుకు హఠాత్తుగా శవాల గుట్టల మధ్య నిర్జీవంగా పడి ఉన్న దృశ్యాలను తలుచుకొని పొగిలిపొగిలి ఏడుస్తున్న తం డ్రులు...! వారంతా ఇటీవల ఏవోబీలో జరిగిన మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌లో తమ కుటుంబీకు లను పోగొట్టుకున్నవారు. ఏవోబీలో సామూహిక హత్యాకాండకు కారకులెవ్వరు అంటూ ఆల్ ఇండియా యూనివర్సిటీ స్టూడెంట్స్ నిజనిర్ధారణ కమిటీ విద్యార్థులు శనివారం ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏర్పా టు చేసిన సదస్సుకు ఎన్‌కౌంటర్ బాధితులు తరలివచ్చారు. నిజనిర్ధారణ నివేదికను ఆవిష్క రించిన అనంతరం మాట్లాడారు. ఏవోబీలో  నిరాయుధులను పట్టుకొని దారుణంగా కాల్చి చంపారంటూ కన్నీళ్లపర్యంతమయ్యారు.  కార్యక్రమంలో ఏవోబీ గణేశ్ అలియాస్ వెంకటరమణ భార్య దమయంతి, డానియల్ తండ్రి మల్లేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

 అవి ప్రభుత్వ హత్యలే: ప్రకాశ్ అంబేడ్కర్
 సాక్షి, హైదరాబాద్ : ఎన్‌కౌంటర్ల పేరుతో దేశంలో ఏ ఒక్క పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోకూడదని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ అన్నారు.   ‘‘మల్కన్‌గిరిలో జరిగింది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. సహజ సంపదలను  బహుళ జాతి కంపెనీలకు కట్టబెడుతున్నారు.  దేశంలో పరిణామాలు ప్రజలను భయభ్రాం తులకు గురిచేస్తున్నారుు’’ అని  అన్నారు.
 
 న్యాయాన్ని చంపేసింది

 మా పిల్లల్ని చదివిస్తే మా కష్టాలు తీరుస్తారని భావించాం. కానీ మా కొడుకు మాకన్నా ప్రజల కష్టాలే ముఖ్యమని భావించాడు. కానీ ఏపీ ప్రభుత్వం న్యాయాన్ని చంపేసి అన్యాయాన్ని బతికిస్తోంది.     
- బ్రహ్మానందం,     ఎన్‌కౌంటర్‌లో మరణించిన కిరణ్ తండ్రి
 
 జనం కోసం ప్రాణాలిచ్చాడు
 నా భర్త పార్టీలోకి వెళ్లి చాలా కాలమైంది. మాకు ముగ్గురు పిల్లలు. మేమంటే చాలా ప్రేమ. ఎక్కడికో వెళ్లాడనుకున్నా. కానీ జనం కోసం ప్రాణాలిచ్చాడని తెలిసి గర్వపడుతున్నాను.
         - కమలకుమారి,  మధు సహచరి
 
 శవాల కోసం వెళ్తే ఆధార్ కార్డు అడిగారు

 మా వారి శవాల కోసం వెళ్తే ఆంధ్రా పోలీసులు ఆధార్ కార్డు అడిగారు. ఆందోళనతో ఉన్న మేం ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు తీసుకొని మా వారి శవాల దగ్గరికెలా వెళ్తాం?
      - స్వప్న,  భారతి కోడలు
 
 అందరూ ఖండించాలి..
 నిశ్శబ్దాన్ని ఛేదించాలి. ఎన్‌కౌంటర్ పేరుతో ఆదివాసీ లను చిత్రహింసలకు గురిచేసిన ఏపీ ప్రభుత్వ చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి.
     - శిరీష, మున్నా తల్లి
 
 నెత్తుటి మూటలను తెచ్చుకున్నాం..
 నా భర్త శవాన్ని నెత్తుటి మూటలుగా మోసుకొచ్చాం. నా భర్త పేగులు బయట పడుతుంటే నా పేగులు తరుక్కుపోయా రుు. ప్రజాగాయకుడిని రక్తపుముద్దగా మార్చారు.
     - దేవేంద్ర,, ప్రభాకర్ భార్య
 
  చర్చలకు పిలువ వచ్చుకదా...
 వైఎస్‌ఆర్ ఉన్నప్పుడు చర్చ లకు పిల్చి మాట్లాడారు. కనీసం ఆ పని చేయొచ్చు కదా ఈ ఏపీ ప్రభుత్వం. అది మంచి పనే కదా?
     -విలాస్, దయ అన్న కొడుకు
 
 బయటకు రప్పించి జైల్లో వేస్తున్నారు
 భూస్వాములకు వ్యతిరేకంగా మమత ఉద్యమంలోకి పోరుుంది. జనజీవన స్రవంతిలోకి రమ్మంటూ కుట్రపూ రితంగా బయటకు రప్పించి పోలీసులు జైలు పాల్జేస్తున్నారు.
     - కామమ్మ, మమత అక్క

Advertisement
Advertisement