'సీఎం చేతిలో ఇప్పుడు వజ్రాయుధం ఉంది' | Sakshi
Sakshi News home page

'సీఎం చేతిలో ఇప్పుడు వజ్రాయుధం ఉంది'

Published Sun, Sep 29 2013 9:52 PM

'సీఎం చేతిలో ఇప్పుడు వజ్రాయుధం ఉంది' - Sakshi

కడప: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో అసెంబ్లీ తీర్మానం అనే వజ్రాయుధం ఉందని వైఎస్సార్ సీపీ నేత మైసూరా రెడ్డి తెలిపారు. విభజన బిల్లు తీర్మానాన్ని అసెంబ్లీలో పెడితే ఎవరేమిటో పది నిమిషాల్లో తెలుస్తుందని మైసూరా సవాల్ విసిరారు. అసెంబ్లీ సమన్వయ పరచకుండా సీఎం డ్రామాలాడుతున్నారన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో తీర్మానం వంటి వజ్రాయుధం కిరణ్ చేతిలో ఉందన్నారు. విభజన బిల్లు తేవాలంటే కారణం ఏమని చెబుతారు ?:అని మైసూరా ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీకి 10 సీట్లు కావాలని చెబుతారా ? అని చెబుతారా అని నిలదీశారు.

 

సమైక్య ఉద్యమానికి వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తమ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లు తెలిపారు. తండ్రిలా విభజన చేయకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ డిమాండ్ అన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఉండాలనేది వైఎస్ఆర్సిపి  అభిమతం అని తెలిపారు.

Advertisement
Advertisement