పులిచింతల ప్రారంభం | Sakshi
Sakshi News home page

పులిచింతల ప్రారంభం

Published Sun, Dec 8 2013 1:39 AM

పులిచింతల ప్రారంభం - Sakshi

సాక్షి, గుంటూరు: కృష్ణా నదిపై కొత్తగా నిర్మించిన డాక్టర్ కె.ఎల్.రావు సాగర్ పులిచింతల ప్రాజెక్టును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. సీఎం 12.50 గంటలకు గుంటూరు జిల్లా అచ్చంపేట మండ లం జడపల్లిమోటు తండాకు చేరుకున్నారు. పులిచింతల ప్రాజెక్టు ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి, ప్రాజెక్టు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రేడియల్ క్రస్ట్‌గేట్లను ఎత్తి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. కార్యక్రమంలో స్పీకర్ మనోహర్‌తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. కాగా, సీఎంను కలిసి గోడు వెళ్లబోసుకునేందు కు వచ్చిన వందలాది మంది పులిచింతల ముంపు గ్రామాల నిర్వాసితులను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.

 

 మహానేత వైఎస్ ఫ్లెక్సీ లేదు.. పేరూ లేదు..

 

 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2004 అక్టోబర్ 15న పులిచింతల ప్రాజె క్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. జలయజ్ఞంలో భాగంగా మొదలైన మొట్టమొదటి ప్రాజెక్టు ఇది. ఇక్కడికొచ్చిన రైతులు, పలువురు కిందిస్థాయి ఉద్యోగులు నేరుగా వైఎస్ కృషిని శ్లాఘించినా.. ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కిరణ్‌గానీ, మంత్రులుగానీ ప్రాజెక్టు ప్రదేశంలో వైఎస్ పేరును కనీసం ప్రస్తావించలేదు. ఫ్లెక్సీల్లో ఎక్కడా వైఎస్ పేరు కానీ, ఫొటో కానీ పెట్టకపోవటం రైతాంగాన్ని విస్మయానికి గురిచేసింది. అలాగే.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్, ప్రధాని మన్మోహన్‌ల ఫోటోలు కూడా ఎక్కడా కనిపించకపోవటం విశేషం.

Advertisement

తప్పక చదవండి

Advertisement