కృష్ణ.. కృష్ణా!

10 Apr, 2017 12:30 IST|Sakshi

కృష్ణమ్మ బిరబిరా పరుగులు ఆగిపోనున్నాయి.. ఏరువాక వచ్చిందంటే ఆ జీవనది గలగల సవ్వడులు వినిపించేవి. కానీ ఆగస్టు తరువాతే గాని వరదనీరు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం మిగులు జలాల్లో ఎగువరాష్ట్రాలకు నీటివాటా కల్పించడం పాలమూరు ప్రాజెక్టులకు నీటిరాక కష్టమే..! ఇప్పటికే కృష్ణానదికి ఆలస్యంగా వరదలు వస్తున్నాయి. ఆల్మట్టి డ్యాం ఎత్తుపెంపు వల్ల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
 
  కాగా, బచావత్ ట్రిబ్యునల్ అవార్డు పూర్తయ్యే నాటికే ప్రాజెక్టులను నిర్మించకపోవడం, ప్రభుత్వాల ముందుచూపు లేకపోవడం, మిగులు జలాలపై సరైన వాదనలు వినిపించడం వెరసి..జిల్లా ప్రాజెక్టులకు శాపంగా మారింది. బ్రిబ్యునల్ తీర్పు అమలైతే మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన నెట్టెంపాడు, ఎంజీఎల్‌ఐ, ఎస్‌ఎల్‌బీసీ, బీమా, డిండి, అమ్రాబాద్, కోయిల్‌సాగర్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు నీటిగండం ఏర్పడనుంది. ఇదే జరిగితే పాలమూరు ఎడారిగా మారడం ఖాయం..
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా