నాగ పడగల కొరత తీరింది | Sakshi
Sakshi News home page

నాగ పడగల కొరత తీరింది

Published Mon, Jun 23 2014 3:03 AM

నాగ పడగల కొరత తీరింది

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహుకేతు పూజలకు వినియోగించే నాగపడగల కొరత ఎట్టకేలకు తీరింది. ఆది వారం జరిగే పూజలకు సరిపడా నాగపడగలు మాత్రమే ఆల యంలో నిల్వ ఉండడంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది. శనివారం రాత్రి నాగపడగల కోసం 100 కేజీలు కరిగించిన వెండిని హైదరాబాద్ నుంచి ఆలయానికి తీసుకువచ్చారు. దాంతో ఆలయ మింట్‌లో నాగపడగలు తయారు చేశారు.

సోమవారానికి సరిపడా తయారు చేయడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. వారం రోజుల క్రితం దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ అభయన్స్ వెండి కరిగించరాదని ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. ప్రతి ఆరు నెలలకొకసారి ఆలయం నుంచి 2,500 కేజీల వెండిని హైదరాబాద్ మింట్‌కు తీసుకుపోవడం, కరిగించిన వెండి ముద్దలను తీసుకొచ్చి నాగపడగలు తయారు చేయడం మామూలే. వెండి కరిగింపునకు కమిషనర్ అడ్డు చెప్పడంతో అధికారులకు టెన్షన్ తప్పలేదు.

ఈ నేపథ్యంలో నాగపడగల కొరత విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లడంతో సుముఖత వ్యక్తం చేశారు. 2,500 కేజీల వెండిని కరిగించి ఒక్కసారిగా హైదరాబాద్ నుంచి తీసుకురావడానికి ఆలస్యమవుతుందని గుర్తించి మొదటిగా కరిగించిన 100 కేజీల వెండిని శనివారం రాత్రి ఆలయానికి తీసుకువచ్చారు.
 

Advertisement
Advertisement