వింటే కదా.. నేర్చుకునేది! | Sakshi
Sakshi News home page

వింటే కదా.. నేర్చుకునేది!

Published Fri, Aug 21 2015 3:54 AM

వింటే కదా.. నేర్చుకునేది! - Sakshi

- తూతూ మంత్రంగా ‘విందాం - నేర్చుకుందాం
- కొరవడిన అధికారుల పర్యవేక్షణ
- నీరుగారుతోన్న ప్రభుత్వ లక్ష్యం
అనంతపురం ఎడ్యుకేషన్ :
పిల్లలకు ప్రాథమిక విద్యను గుణాత్మకంగా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో 1-5 తరగతు ల విద్యార్థుల కోసం ‘విందాం - నేర్చుకుందాం’ రేడియో పాఠాలను ఉదయం 11 నుంచి11.30 గంటల దాకా ప్రసారం చే స్తోంది. ఈ ఏడాది జులైలో ప్రారంభించిన ఈ కార్యక్రమం 2016 మార్చి ఆఖరు వరకు కొనసాగించాల్సి ఉంది.
 
కార్యక్రమ నిర్వహణ ఇలా...
పిల్లలను అర్థవృత్తాకారంలో కూర్చోబెట్టాలి. పిల్లలతోపాటు  టీచరు కూడా శ్రద్ధగా రేడియో పాఠం వినాలి. ఇదే సమయంలో సాం కేతిక పదాలు, ముఖ్యాంశాలు, ఆసక్తికర సంభాషణలను నోట్ బుక్కులో నమోదు చేయాలి. పిల్లల ప్రతిస్పందనలు నమోదు చేయాలి. రేడియో పాఠం ముగిసిన తర్వాత పిల్లలతో మాట్లాడాలి. ముందుగా పిల్లలను సాధారణ ప్రశ్నలు అడగాలి.  నమోదు చేసుకున్న సాంకేతిక పదాల అర్థాలను వివరించాలి.
 
అమలుతీరు ఇలా...

చాలా స్కూళ్లలో నేటికీ ఈ  విందాం-నేర్చుకుందాం అనే రేడియో కార్యక్రమం ఉందనే విషయం విద్యార్థులకు తెలియదు. జిల్లా కేం ద్రంలోని స్కూళ్లలోనే సరిగా అమలు కావడం లే దు.  రేడియో సిగ్నల్ సరిగా పని చేయలేదంటూ కారణాలు చెబుతున్నారు. మరి కొన్నిచోట్ల రేడియో ఆన్ చేసేసి ఉపాధ్యాయులు వారి గదిలోకి వెళ్లిపోతూ కార్యక్రమం అయిందనిపిస్తున్నారు.
 
పట్టించుకోని ఎస్‌ఎస్‌ఏ అధికారులు
కార్యక్రమాన్ని పర్యవేక్షించాల్సిన ఎస్‌ఎస్‌ఏ అధికారులు పట్టించుకోవడం లేదు. అమలుపై తూతూమంత్రంగా సమావేశాలు నిర్వహించారు. సుమారు రూ. 40 వేలు విలువైన కరదీపికలు పాఠశాలలకు పంపారు. చాలా స్కూళ్లలో ఆ కరదీపికలను తెరిచి కూడా చూడలేదని సమాచారం.
 
లోపాలు వాస్తవమే
‘విందాం-నేర్చుకుందాం’ అమలులో లో పాలు ఉన్న మాట వాస్తవమే. ఎస్‌ఎస్‌ఏ అధికారులతో పాటు విద్యాశాఖ అధికారులు తనిఖీలు చే యాలి. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంది. పర్యవేక్షణ పెంచి అన్ని స్కూళ్లలోనూ అమలయ్యేలా చూస్తాం.
 - చెన్నకృష్ణారెడ్డి, ఏఎంఓ

Advertisement

తప్పక చదవండి

Advertisement