వైఎస్సార్‌ సీపీ ప్లీనరీ ఆహ్వానితులు వీరే.. | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ ప్లీనరీ ఆహ్వానితులు వీరే..

Published Fri, Jun 30 2017 10:30 PM

వైఎస్సార్‌ సీపీ ప్లీనరీ ఆహ్వానితులు వీరే.. - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ బ్యూరో: వచ్చే నెల 8,9 తేదీల్లో అమరావతిలో జరిగే వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలకు క్రింద పార్టీ ప్రకటించిన అన్ని విభాగాల వారు తప్పక హాజరుకావాలని పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రాజకీయ కార్యదర్శులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు(పీఏసీ మెంబర్స్‌), కేంద్ర పాలక మండలి సభ్యులు(సీజీసీ మెంబర్స్‌), కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు(సీఈసీ మెంబర్స్‌), రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు, జిల్లా, నగర పార్టీ పరిశీలకులు, జిల్లా, నగర పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు, కార్పొరేషన్‌ మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఛైర్మన్లు, రాష్ట్ర కార్యదర్శులు రాష్ట్ర అదనపు కార్యదర్శులు రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్‌ పరిశీలకులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, డీసీసీబీ డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్లు, రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీ సభ్యులు, జిల్లా నగర పార్టీ కమిటీ సభ్యులు, జిల్లా నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్లు, కార్పొరేషన్‌ మాజీ మేయర్లు, కార్పొరేటర్లు, కార్పొరేటర్లుగా పోటీ చేసినవారు, జెడ్‌పీటీసీలు, జెడ్‌పీటీసీలుగా పోటీ చేసినవారు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ఎంపీటీసీలుగా పోటీ చేసినవారు, మున్సిపల్‌ ఛైర్మన్లు కౌన్సిలర్లు, కౌన్సిలర్లుగా పోటీ చేసినవారు, మార్కెట్‌ కమిటీల మాజీ చైర్మన్లు, మండల మున్సిపల్‌ టౌన్‌ నగర డివిజన్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ జెడ్‌పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మున్సిపల్‌ మాజీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లు సింగిల్‌ విండో అధ్యక్షులు, దేవాలయ మాజీ చైర్మన్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు గ్రామ సర్పంచ్‌, గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసినవారు, గ్రామ ముఖ్యులు(గ్రామం నుండి ఈ నాలుగు హోదాలలో ఎవరో ఒకరు ఆహ్వానితులుగా ఉంటారు).

Advertisement

తప్పక చదవండి

Advertisement