పోలీసు కస్టడీకి సీపీఎం నేతలు | Sakshi
Sakshi News home page

పోలీసు కస్టడీకి సీపీఎం నేతలు

Published Tue, Oct 22 2013 6:44 AM

Leaders of the police custody CPM

సాక్షి, నిజామాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇందల్‌వాయి ఎఫ్‌ఆర్‌ఓ (ఫారెస్టు రేంజ్ అధికారి) రొడ్డ గంగయ్య హత్య కేసు దర్యాప్తులో ఓ అడుగు ముందుకు పడింది. కోర్టులో లొంగిపోయిన నిందితుడు సీపీఎం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, ఆ పార్టీ మహిళా నాయకురాలు జమునను పోలీసులు రెండురోజుల కస్టడీకి తీసుకున్నారు. వీరిని ప్రశ్నిం చేందుకు పది రోజులు కస్టడీకి ఇవ్వాలని జిల్లా రెండో అదనపు మేజిస్ట్రేట్ కోర్టుకు విజ్ఞప్తి చేయగా, కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది. గత నెల 15న అటవీ భూ ఆక్రమణదారుల చేతుల్లో గంగయ్య దారుణ హత్యకు గురయ్యారు. పథకం ప్రకారం ఆయనను కిరాతకంగా దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనను రాష్ట్ర సర్కారు తీవ్రంగా పరిగణించింది.

ఈ ఘటనలో మొత్తం 36 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో 33 మందిని అరెస్టు చేసిన పోలీసులు పెద్ది వెంకట్రాములుతో పాటు, జమున పరారీలో ఉన్నారని ప్రకటించారు. ఎట్టకేలకు వీరిద్దరు నెల రోజుల అనంతరం ఈనెల 15న కోర్టులో లొంగిపోయారు. కోర్టు 15 రోజుల జుడీషియల్ కస్టడీకి ఆదేశించినట్లు వీరిని జిల్లా జైలుకు తరలించారు. సోమవా రం జిల్లా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నా రు.

ఇంకా ఈ కేసులో ట్రాక్టర్ డ్రైవర్ రాజు పరారీలోనే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. రాజు మినహా ఈ దారుణ ఘట నలో ప్రమేయం ఉన్న పాత్రదారులందరిని అరెస్టు చేసిన పోలీసులు.. సూత్ర దారులెవరో గుర్తించే పనిలో పడ్డారు. హత్యకు పథ క రచన చేసిందెవరో పరిశోధిస్తున్నారు. పెద్ది వెంకట్రాములు, జమునను అన్ని కోణాల్లో ప్రశ్నిస్తామని ఎస్‌పీ కేవీ మోహన్‌రావ్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. వారి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తామన్నారు.

 ఇంకా అందని పోస్టుమార్టం రిపోర్టు

 గంగయ్య హత్య కేసుకు సంబంధించి వైద్యులు ఇచ్చే పోస్టుమార్టం నివేదిక ఇంకా తమకు అందలేదని కేసు దర్యాప్తు అధికారి, నిజామాబాద్ డీఎస్‌పీ అనిల్‌కుమార్ తెలి పారు. మరణించిన గంగయ్యతో పాటు, స్వల్ప గాయాలపాలైన మరో ఆరుగురు అటవీశాఖ సిబ్బందికి సంబంధించిన పోస్టుమార్టం నివేదిక కూడా పోలీసులకు అందాల్సి ఉంది. హత్యకు వినియోగించిన గొడ్డలి, కర్ర తదితర ఆయుధాలను స్వాధీ నం చేసుకున్న పోలీసులు వాటిని ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.
 

Advertisement
Advertisement