రుణ మా(ఫీ)య | Sakshi
Sakshi News home page

రుణ మా(ఫీ)య

Published Tue, Jul 22 2014 11:56 PM

రుణ మా(ఫీ)య - Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రుణమాఫీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన అన్ని వర్గాలకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. టీడీపీ మంత్రులు, నేతలు, కార్యకర్తలను నిలదీసేందుకు ఆయూ వర్గాలు సిద్ధమవుతున్నాయి. పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరులో డ్వాక్రా గ్రూపు సభ్యులు కన్నెర్ర చేసి రోడ్డెక్కారు.
 
 వ్యవసాయం పట్ల మొదటినుంచి తేలిక భావం కలిగిన చంద్రబాబు మారాడని భావించి మొన్నటి ఎన్నికల్లో ఓట్లు వేశామని, అరుుతే రుణమాఫీపై ప్రకటనను బట్టి ఆయన మారలేదని స్పష్టమైందని రైతులు అంటున్నారు. రుణమాఫీ చేస్తానని బాబు కాలయాపన చేయడంతో నెల నుంచి బ్యాంకుల్లో రుణాలు దొరక్క ఖరీఫ్ పనులు ఆలస్యమైనాయని, దీనివల్ల దిగుబడులు తగ్గే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయూరైందని వాపోతున్నారు.
 
 ఇదిలాఉండగా పరిమిత రుణమాఫీని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టేందుకు విపక్షాలు సిద్ధవుతున్నాయి. మరోవైపు.. చంద్రబాబు నిర్ణయానికి అనుకూలంగా టీడీపీ తమ్ముళ్లు సంబరాలు జరుపుకుంటుండటం విస్మయం కలిగిస్తోంది. అప్పుడు గెలుపే ధ్యేయం.. ఎన్నికల సమయంలో గెలుపే ధ్యేయంగా టీడీపీ పనిచేసింది. రైతులు, డ్వాక్రా గ్రూపు సభ్యులు తీసుకున్న రుణాలను పూర్తిగా రద్దు చేస్తామని పార్టీ అధినేత చం ద్రబాబు హామీ ఇచ్చారు.
 
 అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయిం చారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్న సమయంలో రుణమాఫీపై ప్రకటన చేశానని, విభజన తర్వాత రాష్ట్ర ఆదాయ వనరులు అందు కు సహకరించడం లేదంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేశారు. జిల్లాల్లో తిరి గిన మంత్రులు కూడా అధినేత కు వంత పాడారు. గుంటూరు జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసా యశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రుణాలను మాఫీ చేయడానికి తమ వద్ద అక్షయపాత్ర, మంత్రదండం లేవని పేర్కొన్నారు.
 
 ఈ నేపథ్యంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ వివరాలను వెల్లడించారు. ప్రతి రైతు కుటుంబానికి రూ.1.50 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని, డ్వాక్రా గ్రూపులకు లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని వెల్లడించారు. దీనిపై రైతులు, డ్వాక్రా గ్రూపుల సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెదకూరపాడు మండలం 75 త్యాళ్లూరులో ఆంధ్రాబ్యాంకు, ఐకేపీ సిబ్బంది మంగళవారం డ్వాక్రా గ్రూపు సభ్యులతో సమావేశం నిర్వహించి రుణాలు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో వారంతా రాస్తారోకో నిర్వహించారు. గ్రూపునకు రూ.లక్ష వరకే మాఫీ చేయడం వల్ల గ్రూపులోని 10 నుంచి 12 మంది సభ్యులకు మాఫీ రూ.10 వేలలోపే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 ఇదీ పరిస్థితి.. జిల్లాలోని 52,373 స్వయం సహాయక సంఘాలు రూ.1145 కోట్లు రుణాలుగా తీసుకున్నాయి. ఒక్కో గ్రూపునకు లక్ష రూపాయలు మాఫీ చేస్తే రూ.523 కోట్లు మాత్రమే మాఫీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. రైతులు రూ.4005 కోట్ల మేర రుణాలు తీసుకున్నారు. ఒక కుటుంబానికి ఒక రుణం మాత్రమే రద్దు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఫలితంగా సగానిపైగా రైతులకు మాఫీ వర్తించే అవకాశాలు కనపడటం లేదు. వరినారుమళ్లు, నాట్లు, ఎరువులు వేసే సమయంలో రైతులు దశలవారీగా బ్యాంకు రుణాలు తీసుకుంటారు. ఖరీఫ్ సీజను పూర్తయ్యేలోపు మూడునాలుగు సార్లు రుణం తీసుకుంటారు. అయితే ఒక రుణానికే మాఫీని వర్తింపచేయడం వల్ల రైతులకు పెద్దగా లా భం ఉండదు. బాబు ప్రకటనపై అన్ని వర్గాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటే గుంటూరు టీడీపీ కార్యాలయంలో నేతలు మాత్రం సం బరాలు జరుపుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
 
 30న మహాధర్నా
 డ్వాక్రా, చేతి వృత్తిదారుల రుణాలన్నీ బేషరతుగ మాఫీ చేయాలని కోరుతూ ఈ నెల 30న సమాజ్‌వాది పార్టీ గుంటూరులోని కలెక్టరేట్ ఎదుట మహాధర్నాను చేపట్టనున్నది. ఈ మేరకు పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.నవీన్‌కుమార్, వై.వి.సురేష్‌లు ధర్నా వివరాలను వెల్లడించారు. రుణమాఫీని పూర్తిగా అమలు చేయగలిగే పరిస్ధితులు లేనప్పుడు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
 

Advertisement
Advertisement