రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలి: టీజేఏసీ | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలి: టీజేఏసీ

Published Sat, Mar 1 2014 1:46 PM

రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలి: టీజేఏసీ - Sakshi

టీజేఏసీ రాజకీయపార్టీగా మారదు.. అయితే అందులోని వ్యక్తులుగా ఎవరైనా రాజకీయాల్లోకి వెళ్లవచ్చు అని తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం తెలిపారు. టీజేఏసీ నేతలు శనివారం హైదరాబాద్లో సమావేశమైయ్యారు. అన్ని పార్టీల ప్రమేయంతోనే తెలంగాణ సాధ్యమైందన్నారు. అంతేకాని ఏ ఒక్క పార్టీ విజయమో కాదని స్పష్టం చేశారు. అనంతరం టీజేఏసీ నేతలు మాట్లాడుతూ... రాష్ట్రపతి పాలనను తక్షణం ఎత్తివేయాలి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని యూపీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

 

తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా టీజేఏసీ కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములం అవుదామని ఈ సందర్భంగా నేతలకు పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చినా కొన్ని సమస్యలు ఉన్నాయి... వాటిని సమిష్టిగా పరిష్కరించు కుంటామన్నారు. త్వరలో విజయోత్సవ సభలు నిర్వహిస్తామని టీజేఏసీ నేతలు వెల్లడించారు.

Advertisement
Advertisement