కార్యకర్తలకు అండగా ఉంటాం | Sakshi
Sakshi News home page

కార్యకర్తలకు అండగా ఉంటాం

Published Fri, May 30 2014 2:51 AM

'll Support workers

 సాక్షి, నెల్లూరు: ‘సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వస్తామనుకున్నాం. దురదృష్టవశాత్తు రాలేకపోయాం. అయినా వెరవం. కార్యకర్తలకు అండగా నిలబడతాం. వారికి ఏ చిన్న సమస్య వచ్చినా పార్టీ అండ ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించేలా కృషి చేద్దాం’ అని వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, అంబటి రాంబాబు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం వైఎస్సార్‌సీపీ సమీక్ష సమావేశం జరి గింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ కోవూరు, నెల్లూరుసిటీ, రూరల్, సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరు, కావలి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమీక్షించారు.
 
 పార్టీ గెలుపోటములపై అందరి అభిప్రాయాలను తీసుకున్నారు. పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలను తెలుసుకున్నారు. పరిశీలకులుగా వచ్చిన రామచంద్రారెడ్డి, గోవిందరెడ్డి, అంబటి రాంబాబు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి రాలేదన్న బాధ అందరికీ ఉందన్నారు. ఆ బాధను మరిచి  పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ స్వల్ప ఓట్లతేడా అధికారానికి దూరమైందన్నారు. భవిష్యత్‌లో పార్టీని గ్రామస్థాయిలో మరింత పటిష్టం చేసి ముందుకు సాగుదామన్నారు.
 
 ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, నెల్లూరు సిటీ ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, రూర ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, సర్వేపల్లి నుంచి పార్టీ నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నేదురుమల్లి పద్మనాభరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నెల్లూరు మేయర్ అభ్యర్థి అబ్దుల్ అజీజ్, ఆనం వెంకటరమణారెడ్డి, పాండురంగారెడ్డి, వహీద్‌బాషా పాల్గొన్నారు.
 
 కార్యకర్తలను కాపాడుకుంటాం:
 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
 రాబోయే ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాపాడుకుంటామని పార్టీ ముఖ్యనేత పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి విలేకరులతో చెప్పారు. పార్టీ అభ్యర్థుల గెలుపోటములకు కారణాలను తెలుసుకునేందుకే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారన్నారు.
 
 పార్టీ పటిష్టతకు చర్యలు : డీసీ గోవిందరెడ్డి
 పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకుని వాటిని సరిదిద్ది పార్టీ పటిష్టతకు చర్యలు చేపట్టనున్నట్టు పరిశీలకుడు డీసీ గోవిందరెడ్డి విలేకరులతో చెప్పారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. నేతలు, కార్యకర్తల అభిప్రాయాల నివేదికల ఆధారంగా పార్టీ అధినేత సైతం సమీక్షించి రాబోయే కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటారన్నారు. వైఎస్సార్‌సీపీ స్వల్ప ఓట్లతోనే ఓటమి చెందిందన్నారు. దీనిని సరిదిద్దుకుని నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు. కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని గోవిందరెడ్డి చెప్పారు.
 
 కార్యక ర్తలకు పార్టీ అండగా ఉంటుంది : అంబటి రాంబాబు
 ‘పార్టీ అధికారంలోకి వస్తుందని అందరం ఆశించాం.
 దురదృష్టవశాత్తు ఓటమి చెందాం. అయినా తిరిగి లేచి పార్టీ కోసం పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది’ అని అంబటి రాంబాబు విలేకరుల సమావేశంలో చెప్పారు. వైఎస్సార్‌సీపీ 67 మంది శాసన సభ్యులను గెలవడం సామాన్య విషయం కాదన్నారు. పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. చిన్న సమస్య వచ్చినా పోరాటం సాగిస్తామన్నారు. కాంగ్రెస్ అంతరించిందన్నారు. అక్రమ కేసులు, బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు బెదరవన్నారు.
 

Advertisement
Advertisement